STOCKS

News


2శాతం పతనమైన అమెరికా మార్కెట్లు

Saturday 23rd March 2019
Markets_main1553336265.png-24771

అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలు, బలహీన ఆర్థిక గణాంకాలు అమెరికా మార్కెట్లపై నెగిటివ్‌ ప్రభావం చూపాయి. ఫలితంగా ఈ దేశ ప్రధాన సూచీలు శుక్రవారం రాత్రి 2శాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో వెలువడిన బలహీన ఆర్థిక గణాంకాల నేపథ్యంలో అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 10బేసిస్‌ పాయింట్లు నష్టపోయి 2.439 శాతం స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 460 పాయింట్లు నష్టపోయి 25,502 వద్ద, ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ 54పాయింట్లు క్షీణించి 2,801 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 196 పాయింట్లు పతనమైన 7,642 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 3 తరువాత మార్కెట్లు ఒకేరోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. శుక్రవారం సిటిగ్రూప్‌ షేరు 4శాతం నష్టపోగా, గోల్డ్‌మెన్‌ శాచ్స్‌, మోర్గాన్‌ స్లాన్లీ, జే.పీ మోర్గాన్‌, అమెరికా ఆఫ్‌ అమెరికా షేర్లు 3శాతం నష్టపోయింది. వీటితో పాటుగా టెక్నాలజీస్‌ షేర్లైన అమెజాన్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. 
5.50శాతం నష్టపోయి టాటామోటర్‌  ఏడీఆర్‌ :- 
అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం భారీగా నష్టపోయాయి. విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటర్స్‌ ఏడీఆర్‌లు 5.50శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 5.50శాతం పతనమైంది. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 3శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో ఏడీఆర్‌లు2.50శాతం, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు1.50శాతం క్షీణించాయి. 



You may be interested

ఈ పరుగులు కొనసాగేనా?

Saturday 23rd March 2019

ఈ వారం మార్కెట్‌ వెనకడుగు అవకాశాలు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయమని నిపుణుల సలహా దేశీయ మార్కెట్లు గతవారం కూడా బలంగానే కొనసాగాయి. వారంతంలో చిన్నపాటి పతనం మినహా వారమంతా సూచీలు స్థిరంగా ముందుకే అడుగు వేశాయి. అయితే అంతకముందు వారం కనిపించిన ఉత్సాహం ఈ వారం మార్కెట్లో కనిపించలేదు. కొన్ని రంగాల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఆరంభమైంది. వారంతంలో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఎక్కువైంది. మార్చి ఆరంభం నుంచి మార్కెట్‌ పరుగు స్టార్టవగానే అనేక బ్రోకరేజ్‌లు

మోదీ మళ్లీ వస్తే నిఫ్టీ@ 13,000!

Saturday 23rd March 2019

ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ అంచనా మార్కెట్లో నెలకొన్న పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఏడాది మొత్తం కొనసాగవచ్చని ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ అనలిస్టు ఫొరమ్‌ పరేఖ్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలకు ముందే నిఫ్టీ 12 వేల పాయింట్లను తాకవచ్చని, ఒకవేళ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం మరలా గెలిస్తే నిఫ్టీ 13వేల పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ర్యాలీ మోదీ ప్రభుత్వం భారీ విజయం సాధిస్తుందన్న అంచనాలను డిస్కౌంట్‌ చేస్తోందన్నారు. ఈ ఏడాది

Most from this category