STOCKS

News


ఆసియా మార్కెట్లు రయ్‌.. రయ్‌..

Thursday 8th November 2018
Markets_main1541648647.png-21779

అమెరికా మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు గురువారం జోరు మీదున్నాయి. ప్రధాన సూచీలన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 27 పాయింట్ల లాభంతో 3,092 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 57 పాయిం‍ట్ల లాభంతో 9,965 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 13 పాయింట్ల లాభంతో 2,654 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 31 పాయింట్ల లాభంతో 2,109 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌  ఏకంగా 220 పాయింట్ల లాభంతో 26,368 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 423 పాయింట్ల లాభంతో 22,509 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా బుధవారం వెల్లడైన అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ.. ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్)లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ.. సెనేట్‌లో ఆధిక్యం సాధించింది.  



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Thursday 8th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:16 సమయంలో 8 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,614 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా, ఇదే ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే

స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Thursday 8th November 2018

బలి ప్రతిపాద సందర్భంగా నేడు (గురువారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. తిరిగి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ శుక్రవారం ప్రారంభమౌతుంది. ఇక కమోడిటీ ఎక్స్చేంజ్‌ల విషయానికి వస్తే ట్రేడింగ్‌ గురువారం సాయంత్రం జరుగుతుంది. కాగా సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహురత్ ట్రేడింగ్‌లో భారత్‌ స్టాక్ మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 245 పాయింట్లు లాభపడి 35,237 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 10,598 వద్ద క్లోజయ్యాయి.  

Most from this category