News


5నెలల గరిష్టం వద్ద ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 16th March 2019
Markets_main1552731553.png-24643

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి లాభాలతో ముగిశాయి. టెక్నాలజీస్‌ షేర్ల ర్యాలీ ఇందుకు కారణమైంది. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 14పాయింట్లు పెరిగి 2,822.48 వద్ద స్థిరపడింది. ఇది ఈ సూచీకి 5నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 57 పాయింట్లు లాభపడి 7,688.53 వద్ద, డోజోన్స్‌ ఇండెక్స్‌ 139 పాయింట్లు ర్యాలీ చేసి 25,849 వద్ద ముగిశాయి. అమెరికా - చైనాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలు సమ్మతించదగినవిగా ఉన్నాయని చైనీస్ ప్రీమియర్ లి కేకియాంగ్ ప్రకటనతో పాటు చైనా నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఉద్దీపన చర్యల ప్రకటన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి.  వచ్చే వారం మంగళ, బుధవారాల్లో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు విశ్లేషకులంటున్నారు.



You may be interested

ఆప్షన్స్‌తో లాభాలకు రక్ష!

Saturday 16th March 2019

పోర్టుఫోలియో హెడ్జింగ్‌కు ఆప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా లాభాలను రక్షించుకోవచ్చని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు.  ఉదాహరణకు x అనే స్టాకు వంద రూపాయల వద్ద ట్రేడవుతుందనుకుందాం. మనం కొన్న తర్వాత ఈ స్టాకు రూ. 110కి చేరిందని భావించండి. అంటే వంద రూపాయల కొనుగోలుపై పదిరూపాయల లాభం కనిపిస్తోంది. ఈ లాభాన్ని కాపాడుకొనేందుకు ఒక 110 పుట్‌ కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడీ స్టాకు తిరిగి రూ. 110 దిగువకు వస్తే పుట్‌

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి 11,500 పాయింట్లపై 11,506 వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11470 పాయింట్లతో పోలిస్తే 36పాయింట్ల లాభంతో ఉంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు పాలసీ సమావేశాలు వచ్చేవారం మంగళ(19న), బుధ(20న) వారాల్లో జరగనున్నాయి. అమెరికాతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై ఈసారి యధాతథ పాలసీని అవలంభించవచ్చని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.

Most from this category