STOCKS

News


ఎన్నికల తర్వాతే ఇండియాలోకి వస్తాం!

Thursday 14th March 2019
Markets_main1552558179.png-24609

జులియస్‌ బేర్‌ అండ్‌ కో
ప్రస్తుతానికి భారత్‌ కన్నా చైనా మార్కెట్‌ మంచి ప్రదర్శన చూపగలదని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం జూలియస్‌ బేర్‌ అండ్‌ కో అభిప్రాయపడుతోంది. ఇండియా మార్కెట్లో కొనుగోళ్లకు తాము ఆసక్తిగానే ఉన్నామని, కానీ మేలో ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో? చూసిన తర్వాతే ఇండియాలోకి ఎంటరవుతామని బ్యాంకు ప్రతినిధి మార్క్‌ మాథ్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల కేంద్రబ్యాంకులు రేట్ల తగ్గింపు వాతావరణాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. అయితే కంపెనీ ఎర్నింగ్స్‌ ఇంకా ఆశావహంగా మారలేదని, క్యు4లో ఫలితాలు బలహీనంగా ఉండొచ్చని అంచానా వేశారు. ఇదే ధోరణి క్యులో కూడా కొనసాగితే ఇబ్బందికరమన్నారు. ఏవి ఎలా ఉన్నా, చివరకు షేరు ధరను నిర్ధారించేది ఎర్నింగ్సేనని, అందువల్ల కంపెనీల ఫలితాల్లో జోరు తప్పక ఆరంభం కావాలని చెప్పారు. క్యు1లో ఎర్నింగ్స్‌ వృద్ధి 2 శాతానికి లోపే ఉండొచ్చని తాము భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల నుంచి నిధులు వెలుపలకు పోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది అమెరికా ఈటిఎఫ్‌ల్లోకి నెగిటివ్‌ నిధులు వస్తే, వర్ధమాన మార్కెట్ల ఈటీఎఫ్‌ల్లోకి పాజిటివ్‌ ప్రవాహం కనిపించిందన్నారు. 



You may be interested

ఫ్లాట్‌ ముగిసిన సూచీలు

Thursday 14th March 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులకు లోనై సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 3పాయింట్ల లాభంతో 37,755 వద్ద, నిఫ్టీ 1.50 పాయింట్లు పెరిగి 11,343 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో సూచీలు కొంతమేర లాభాల్ని ఆర్జించినప్పటికీ.., ఈ లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో విఫలయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 186 పాయింట్ల లాభపడి 29,028.90

యస్‌ బ్యాంక్‌ షేర్లకు డాయిష్‌ బూస్ట్‌

Thursday 14th March 2019

యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ ధరను అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన డాయిష్‌బ్యాంక్‌  పెంచడంతో గురువారం ట్రేడింగ్‌లో 4శాతం ర్యాలీ చేసింది. నేడు యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.247.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాయిష్‌ బ్యాంక్ యస్‌ బ్యాంక్‌ షేర్లపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంకు ఆదాయాలు ఆశించిన స్థాయిలోనే ఉంటాయి.  రుణ నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. కార్పోరేట్‌ రుణ వృద్ధి 12-15శాతం తగ్గవచ్చు. రిటైల్‌/ఎస్‌ఎంఈ రుణ

Most from this category