STOCKS

News


11,171 పాయింట్లు దాటితేనే..

Monday 1st October 2018
Markets_main1538376745.png-20749

లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు
నార్నోలియా బ్రోకరేజ్‌ సూచన
నిఫ్టీ ప్రస్తుతం బలమైన బేర్‌ పట్టులో ఉందని నార్నోలియా బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం నిఫ్టీ తన 5, 10, 20, 50 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువన ట్రేడవుతోంది. సూచీల్లో బేర్స్‌ హవాను గత మూడు రోజులుగా గ్యాప్‌అప్‌లో ఓపెనయ్యి చివర్లో భారీ పతనంతో ముగియడం సూచిస్తోంది. దేశీయ వీఐఎక్స్‌ సూచీ ప్రస్తుతం 17 స్థాయిల వద్ద ఉంది. ఈ సూచీ పెరగడం ఇన్వెస్టర్లలో ఒడిదుడుకులను సూచిస్తోంది. గత ఐదువారాలుగా ఇండియా వీఐఎక్స్‌ హయ్యర్‌ హైలను ఏర్పరుస్తోంది. ప్రస్తుతం స్వల్పకాలిక నిరోధం 19 స్థాయికి సమీపంలో ఉంది. అందువల్ల త్వరలో పతనానికి చిన్నపాటి ముగింపు ఉండొచ్చని అంచనా. నిఫ్టీకి బలమైన మద్దతు 10770- 10800 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. ఈ స్థాయి వద్ద నిఫ్టీ 200 రోజుల డీఎంఏ స్థాయి ఉంది. ఊర్ధ్వముఖ వాలు రేఖ సైతం ఇదే స్థాయి వద్ద ఉంది. అందువల్ల ఇక్కడ నిఫ్టీ నిలదొక్కుకోవచ్చు. ఇదే జరిగి రీబౌన్స్‌ వస్తే నిఫ్టీ 11171 పాయింట్ల వరకు ఎగియవచ్చు. కొంత కాలం నిఫ్టీ 10770- 11170 రేంజ్‌లోనే ఉండవచ్చని అంచనా. పైస్థాయిలో 11170 పాయింట్లను దాటి బలంగా క్లోజయితే కొత్త లాంగ్స్‌ను పరిశీలించవచ్చు. దిగువన 10770 వద్ద ఎంపిక చేసిన స్టాకులను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు నిఫ్టీ ఇంకా చాలా బలహీనంగా ఉంది. ప్రస్తుతం ఇది తన 200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన ఉంది. ఆర్‌బీఐ పాలసీ అనంతరం ఈ సూచీలో కాస్త పాజిటివ్‌ కదలికలుండొచ్చు.



You may be interested

రూపాయి పతనం- ఐటీ షేర్ల ర్యాలీ

Monday 1st October 2018

మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం మిడ్‌ సెషన్‌ సమయానికి ప్రధాన సూచీలన్నీ నష్టాలబాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఒక్క ఐటీ రంగ సూచీ మాత్రం భారీగా లాభపడుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఐటీ ఇందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ చేస్తోంది. ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడుతోంది.

సరికొత్త గరిష్టానికి టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌...

Monday 1st October 2018

డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా సోమవారం ఐటీ షేర్ల రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఐటీ రంగ దిగ్గజ షేర్లైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు తమ సరికొత్త గరిష్టాలను నమోదుచేశాయి. టీసీఎస్‌:-ఐటీ షేర్ల భాగంగా టీసీఎస్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈ టీసీఎస్‌ షేరు రూ.2186.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో కారణంగా టీసీఎస్‌ షేరు 3.35శాతం

Most from this category