STOCKS

News


మార్కెట్‌కు ఎన్నికల ఫలితాలు కీలకం..!

Wednesday 31st October 2018
Markets_main1540973953.png-21613

- డిసెంబర్‌ మొదటి వారం సూచీలకు అత్యంత కీలక సమయం
- మార్కెట్‌ ఒడిదుడుకులపై మోర్గన్‌ స్టాన్లీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్య

ముంబై: లోక్‌ సభ ఎన్నికల వేడి అంతటా తగలడానికి ఇంకా సమయం ఉందని.. అసలు సిసలైన తీవ్ర ఒడిదుడుకులు త్వరలోనే నమోదుకాబోతున్నాయని మోర్గన్‌ స్టాన్లీ ఇండియా ఈక్విటీ రీసెర్చ్ హెడ్, స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై ఇప్పటివరకు అయితే మార్కెట్లు ఇంకా డిస్కౌంట్‌ చేయలేదు. మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం డిసెంబర్‌ మొదటి వారం నుంచి ఎలక్షన్‌ వేడి ప్రారంభంకానుంది. రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం డిసెంబర్‌ 11 నుంచి ప్రారంభం కానుండగా.. సాధారణ ఎన్నికలపై ఆ సమయంలోనే ఒక స్పష్టత రానుందని ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ మొదటివారం అత్యంత కీలకంగా మారింది. ఈ సమయం నుంచే తీవ్ర ఒడిదుడుకులు, మార్కెట్‌ దిశ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను.’ అని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మోర్గన్‌ స్టాన్లీ 25వ వార్షికోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే 12 నెలల్లో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఉంటుందని అంచనావేశారు. దీర్ఘకాలానికి ఫైనాన్స్ కంపెనీలు, కన్జ్యూమర్‌ డిస్క్రిషనరీ రంగ షేర్లు మంచి రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వచ్చే 10 ఏళ్లలో భారత్‌ సగటున 7 శాతం వృద్ధిరేటును నమోదుచేసే అవకాశం ఉందని మోర్గన్‌ స్టాన్లీ వెల్లడించింది.



You may be interested

ఆర్‌బీఐ స్వతంత్రతను గౌరవిస్తాం: కేంద్రం

Wednesday 31st October 2018

ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్రం వ్యవహారశైలితో  విసుగు చెందుతున్న ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చన్న వార్తలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం కేంద్రం హుటాహుటిన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్‌బీఐకి గల స్వతంత్ర ప్రతిపత్తి గౌరస్తాం. నియమ నిబంధనలకు లోబడి ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి విఘాతం కలగనీయం’’ అని తెలిపింది. కొన్ని

కేంద్రం ప్రకటనతో సూచీలు టర్న్‌ఎరౌండ్‌

Wednesday 31st October 2018

ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్న సమయంలో చేసిన ప్రకటనతో స్టాక్‌ సూచీలు వేగంగా కోలుకున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల పెరుగుదలతో 34,140 పాయింట్ల వద్దకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు ర్యాలీ జరిపి 10,283 పాయింట్ల వద్దకు చేరాయి. కే ంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తీవ్ర విబేధాలు తలెత్తాయని వచ్చిన వార్తలతో బుధవారం ఉదయం 10–11 గంటల

Most from this category