STOCKS

News


వేదాంత వెలుగులు

Wednesday 26th September 2018
Markets_main1537953678.png-20598

అకస్మాత్తుగా వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి వేదాంత షేరు వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో వేదాంత షేరు రూ.231.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా వేదాంత షేరు కూడా మిడ్‌సెషన్‌ వరకు స్తబ్దుగా ట్రేడైంది. అయితే, మధ్యాహ్నం సమయంలో తెలియని కారణాలతో ఈ కౌంటర్లో ఒక్కసారిగా కొనుగోళ్ల సందడి మొదలైంది. ఫలితంగా షేరు 6.50శాతం ర్యాలీ చేసిన రూ.245.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలోనే ఎన్‌ఎస్‌ఈలో 3.50కోట్ల పరిమాణం గల షేర్లు చేతులు మారినట్లు ఎక్చ్సేంజ్‌ల గణాంకాలు తెలియజేశాయి. మధ్యాహ్నం గం.2:25ని.లకు షేరు గతముగింపు ధరతో (రూ.230.40)తో 5.21శాతం లాభంతో రూ.242.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ -50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో మూడో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.200.65లు, రూ.355.70లుగా నమోదయ్యాయి.



You may be interested

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ పెట్టుబడులకు ఇదే సమయం

Wednesday 26th September 2018

చెరువులో నీళ్లు అడుగుకు వెళ్లినప్పుడు చేపలను సులువుగా పట్టుకోవచ్చు. దీనే స్టాక్‌ మార్కెట్‌కు అన్వయించుకున్నారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఐవో నవ్‌నీత్‌ మునోత్‌. ఇటీవల కాలంలో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లో మంచి కరెక‌్షన్‌ జరిగిందని, అందువల్ల వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌ పతనం వల్ల కొన్ని లార్జ్‌క్యాప్స్‌ మిడ్‌క్యాప్స్‌ అయ్యాయని, అలాగే కొన్ని

ఎంఎఫ్‌లకు ఉపసంహరణ ఒత్తిళ్లు

Wednesday 26th September 2018

దేశీయ ఈక్విటీల్లో తాజా పతనం మ్యూచువల్‌ ఫండ్‌హౌస్‌లకు ఇబ్బందిగా మారుతోంది. గతంతో పోలిస్తే ఫండ్స్‌ నుంచి పాయింట్లు రిడీమ్‌ చేసుకొని నిధులు ఉపసంహరించుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మరోపక్క ఇప్పటివరకు ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పెట్టుబడుల ప్రవాహాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఎంఎఫ్‌ల్లోకి నిధుల ఇన్‌ఫ్లో కన్నా అవుట్‌ఫ్లో ఎక్కువయింది. కాని ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారలేదు. ఇన్‌ఫ్లో తగ్గినా స్థూల నిధుల ప్రవాహం మాత్రం పాజిటివ్‌గానే ఉంది.

Most from this category