STOCKS

News


మెటల్‌ షేర్ల తళుకులు

Thursday 29th November 2018
Markets_main1543476950.png-22482

హిందాల్కో, వేదాంత షేర్ల ర్యాలీతో గురువారం మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఫెడ్‌ వడ్డీరేట్లపై పెంపుపై పావెల్‌ వాఖ్యలు  మెటల్‌ షేర్ల ర్యాలీకి కారణమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకవేళ ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచకపోతే.., రుణాల రేట్ల తగ్గుతాయి. తద్వారా వ్యయాలు తగ్గి వ్యవస్థలో మూలధన లభ్యత కలుగుతుంది. . ఈసారి వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో వ్యయాలు తగ్గవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం పెరిగింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.23శాతం లాభంతో 3,155.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా, లండన్‌ మార్కెట్లో కాపర్‌ ధరలు పెరగడంతో హిందాల్కో షేరు 4శాతం, వేదాంత లిమిటెడ్‌ 3శాతం లాభపడ్డాయి. నాల్కో 2శాతం, టాటాస్టీల్‌ 1.50శాతం, హిందూస్థాన్‌ జింక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జిందాల్‌స్టీల్‌ అరశాతం పెరిగాయి. మరోవైపు వెల్‌స్పన్‌కార్పోరేషన్‌ 2శాతం, కోల్‌ ఇండియా 1.50శాతం, హిందూస్థాన్‌కాపర్‌ 1శాతం నష్టపోయాయి.



You may be interested

2019 ఈక్విటీనామ సంవత్సరం!!

Thursday 29th November 2018

మెటల్స్‌ మెరవొచ్చు.. ఐఐఎఫ్‌ఎల్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా ఈక్విటీ మార్కెట్‌పై ఏడాది కాల లక్ష్యంతో చాలా బుల్లిష్‌గా ఉన్నానని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. ఈక్విటీలు 2019లో మంచి పనితీరు కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలు వెల్లడించారు. ఎన్నికల కారణంగా కొంత కాలం ఒడిదుడుకులు ఉంటాయని తెలిపారు.  నెల కిందట అక్టోబర్‌ 29న

ఫ్లిప్‌కార్ట్‌పై అమెజాన్‌ పైచెయ్యి

Thursday 29th November 2018

ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య పోటీ త్రీవంగా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో అమెజాన్‌ పైచెయ్యి సాధించింది. స్థూల మర్చండైజ్‌ వ్యాల్యు (జీఎంవీ) పరంగా చూస్తే అమెజాన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ను వెనక్కు నెట్టింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమెజాన్‌ జీఎంవీ 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ జీఎంవీ 6.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. బార్‌క్లేస్‌ నివేదికలో ఈ

Most from this category