News


వేదాంతకు.....స్టెరిలైట్‌ రీ-ఓపెనింగ్‌ వెలుగులు

Monday 17th December 2018
Markets_main1545020888.png-22984

  • 6.50శాతం ర్యాలీ లాభపడిన షేరు

తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారం శాశ్వత మూసివేత ఆదేశాలను జాతీయ హరిత ట్రెబ్యునల్‌ రద్దు చేయడంతో వేదాంత లిమిటెడ్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6శాతం ర్యాలీ చేసింది. తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని స్టెరిలైట్‌ను వెంటనే మూసివేయాల్సిందిగా ఈ ఏడాది మే నెలలో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రమవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టెరిలైట్‌ను శాశ్వతంగా మూసివేయాల్సిందిగా తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వేదాంత లిమిటెడ్‌ ఎన్‌జీటీని ఆశ్రయించింది. దీనిపై విచారించేందుకు ఎన్‌జీటీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. స్టెరిలైట్‌ మూసివేతకు తమిళనాడు అధికారులు అనుసరించిన విధానాలు సక్రమంగా లేవని ఎన్‌జీటీ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలోనే స్టెరిలైట్‌ను మళ్లీ తెరవాల్సిందిగా ఆదేశించింది. ఈ సానుకూల వార్తల నేఫథ్యంలో వేదాంత లిమిటెడ్‌ నేడు బీఎస్‌ఈలో 6.50శాతం లాభంతో రూ.214.25ల ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం గం.9:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.201.2)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.207.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.190.05 రూ.355.70లుగా నమోదైంది. భారత్‌ నుంచి ఏటా ఉత్పత్తి అవుతోన్న 10 లక్షల టన్నుల రాగిలో 40 శాతం స్టెరిలైట్‌ రాగి కర్మాగారం నుంచే వస్తోంది.



You may be interested

రూపీ అప్‌.

Monday 17th December 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం లాభాల్లో ట్రేడవుతోంది. బంగారం దిగుమతులు క్షీణించడంతో వాణిజ్య లోటు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఉదయం 9:15 సమయంలో రూపాయి 71.84 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (శుక్రవారం) స్థాయి 71.90తో పోలిస్తే 0.08 శాతం క్షీణించింది. ఇకపోతే రూపాయి సోమవారం 71.85 వద్ద ప్రారంభమైంది.  అక్టోబర్‌లో 17.13 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు నవంబర్‌లో 16.67 బిలియన్‌ డాలర్లకు

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వేదాంత:- ఇటీవల కాలుష్య కారణంతో వివాదస్పదమై మూసివేయబడిన తూత్తికోడి కాపర్‌ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించడానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ అనుమతినిచ్చింది. అలాగే తమిళనాడు పొల్యూషన్స్‌ కంట్రోల్‌ బోర్డు మరో 3వారాల్లోగా ప్లాంట్ నిర్వహణ కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్‌ను సప్లై చేయాల్సిందిగా స్థానిక విద్యుత్‌ కార్యలయానికి ఆదేశాలు జారీ చేసింది. తేవా ఫార్మా:- మహిళల్లో జన్యుపరమైన లోపం వ్యాధి చికిత్సలో వినియోగించే ‘‘హర్జుమా’’ జనరిక్‌

Most from this category