STOCKS

News


వేదాంత ఏడీఆర్‌ 4% అప్‌..

Saturday 20th October 2018
Markets_main1540019069.png-21319

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ అన్నీ కూడా శుక్రవారం దాదాపుగా లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది. దీని తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్‌ బాగా లాభపడింది. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.42 శాతం వృద్ధితో 11.89 డాలర్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.42 శాతం పెరుగుదలతో 9.58 డాలర్లకు చేరింది. విప్రో ఏడీఆర్‌ 0.99 శాతం వృద్ధితో 5.10 డాలర్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.19 శాతం పెరుగుదలతో 87.55 డాలర్లకి చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.16 శాతం వృద్ధితో 8.52 డాలర్లకి ఎగసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.64 శాతం పెరుగుదలతో 34.71 డాలర్లకి చేరింది. వేదాంత ఏడీఆర్‌ 3.76 శాతం పెరుగుదలతో 11.31 డాలర్లకి ఎగసింది. 



You may be interested

ఆఫ్‌షోర్‌లో రూపీ డౌన్‌

Saturday 20th October 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి పడిపోయింది. 73.48 స్థాయికి పతనమైంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ట స్థాయిల నుంచి తగ్గిన క్రూడ్‌ ధర రూపాయి విలువకు కలిసివస్తోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 29 పైసలు బలపడింది. 73.32 వద్ద ముగిసింది. ఈ నెల

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Saturday 20th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో 10,273 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,303 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

Most from this category