STOCKS

News


వేదాంత ఏడీఆర్‌ జంప్‌..

Thursday 13th September 2018
Markets_main1536811522.png-20210

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ బుధవారం దాదాపుగా అన్నీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. అయితే టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ మాత్రం తగ్గింది. వేదాంత ఏడీఆర్‌ ఏకంగా 5 శాతానికిపైగా ఎగసింది. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.05 శాతం స్వల్ప క్షీణతతో 18.32 డాలర్లకు తగ్గింది. ఇక విప్రో ఏడీఆర్‌ 0.37 శాతం వృద్ధితో 5.36 డాలర్లకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.40 శాతం వృద్ధితో 95.40 డాలర్లకి, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.22 శాతం వృద్ధితో 9.02 డాలర్లకి, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.62 శాతం వృద్ధితో 10.55 డాలర్లకి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.11 శాతం వృద్ధితో 35.39 డాలర్లకి, వేదాంత ఏడీఆర్‌ 5.01 శాతం వృద్ధితో 12.78 డాలర్లకి ఎగశాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 13th September 2018

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 9:23 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 11,430 పాయింట్ల వద్ద ఉంది. రోజంతా ఇదే ట్రెండ్‌ కొనసాగి.. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి.  

స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Thursday 13th September 2018

గణేష్‌ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 13న అంటే గురువారం రోజున ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. ఈక్విటీ మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్‌ జరగదు. అలాగే ఫారెక్స్‌, బులియన్‌, మెటల్‌, కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లు కూడా ఉండవు.  

Most from this category