STOCKS

News


వేదాంత ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 29th September 2018
Markets_main1538194844.png-20686

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. తటస్థంగా ఉంది. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు మాత్రం పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది.  
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.41 శాతం క్షీణతతో 15.36 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.69 శాతం వృద్ధితో 10.17 డాలర్లకు పెరిగింది. విప్రో ఏడీఆర్‌ తటస్థంగా 5.21 డాలర్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.76 శాతం వృద్ధితో 94.10 డాలర్లకి పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.28 శాతం క్షీణతతో 8.49 డాలర్లకి పతనమైంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 0.94 శాతం క్షీణతతో 34.60 డాలర్లకి తగ్గింది. వేదాంత ఏడీఆర్‌ 3.47 శాతం తగ్గుదలతో 12.80 డాలర్లకి క్షీణించింది.  



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Saturday 29th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,956 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,954 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్లు స్వల్ప లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా

రెండు లాభాల్లో.. ఒకటి నష్టాల్లో

Saturday 29th September 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 18 పాయిం‍ట్ల లాభంతో 26,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 0.02 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 8,046 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత భయాలు మార్కెట్‌ లాభాలను పరిమితం

Most from this category