STOCKS

News


పిరమల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ సత్తా ఉన్న స్టాక్స్‌

Wednesday 5th September 2018
Markets_main1536147909.png-19986

దీర్ఘకాల ఇన్వెస్టర్లకు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టుబడులపై నష్టాలొచ్చే అవకాశం లేదని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, ఇండిపెండెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అనలిస్టులకు పలు కంపెనీలు తమ భవిష్యత్తు ప్రణాళికలను దృశ్యరూపకంగా వివరించాయి. వాటిల్లో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ గురించి మవానీ తెలియజేశారు. 

 

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భవిష్యత్తు వృద్ధి ప్రణాళికల గురించి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను గత వారం అనలిస్టుల ముందుంచింది. ఎన్నో కంపెనీలతో చాలా రద్దీగా ఉండే ఫైనాన్షియల్‌ సేవల రంగంలో... ఈ కంపెనీ కొత్త విభాగాలను గుర్తించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి రుణాలివ్వడం, ఖ్వాసీ ఈక్విటీ, మెజానిన్‌ డెట్‌ (రుణాలిచ్చిన సంస్థకు రుణం తీసుకున్న సంస్థ ఆస్తులపై హక్కు లభించేది) విభాగాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మంచి అనుభవం గడించింది. కేవలం రుణమిచ్చే సంస్థగానే పరిమితం కాకుండా, ఎక్కువగా భాగస్వామ్య ఒప్పందాల్లోకి ప్రవేశించింది. అండర్‌రైటింగ్‌ నైపుణ్యాలు, రిస్క్‌ నిర్వహణ పరంగా మెరుగ్గా ఉన్నామన్నది కంపెనీ వివరణ. నిజానికి కంపెనీ ట్రాక్‌ రికార్డు కూడా ఇదే చెబుతోంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో గృహ రుణాల నుంచి కంపెనీ కార్పొరేట్‌, వ్యక్తులకు రుణాలిచ్చే అన్ని విభాగాల్లోకి ప్రవేశించనుంది. కాకపోతే ఫైనాన్షియల్‌ సేవల వ్యాపారంలో రానున్న కాలంలో ఈక్విటీపై రాబడులను పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ పెట్టుబడుల దశలో, వ్యాపార నిర్మాణ స్థితిలో ఉంది. కొంత కాలానికి ఇది ఫలితాలను ఇస్తుంది. ఫైనాన్షియల్‌ సేవలను విడదీసి, విడిగా లిస్ట్‌ చేయడం గురించే అందరూ వేచి చూస్తున్నారు. ఇది జరిగితే కంపెనీ డిస్కౌంట్‌ ప్రైస్‌లో ఉండదు. ఈ స్టాక్‌ ర్యాలీ చేసినందున సమీప కాలంలో చల్లబడడం లేదా దిద్దుబాటుకు గురవడం జరగొచ్చు. దీర్ఘకాలంలో మాత్రం ఈ స్టాక్‌లో నష్టాలకు అవకాశం ఉండదు. డీమెర్జర్‌ వచ్చే రెండు, మూడు, ఐదేళ్లలో జరిగినా గానీ స్థిరమైన వృద్ధి కారణంగా ఇన్వెస్టర్లకు తగినన్ని రాబడులకు అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

 

రిలయన్స్‌ క్యాపిటల్‌

రిలయన్స్‌ క్యాపిటల్‌లో ఎంతో విలువ ఉంది. గత కొన్నేళ్లుగా ఈ స్టాక్‌లో ప్రతికూల సెంటిమెంట్‌ నెలకొని ఉంది. గ్రూపులోని ఇతర కంపెనీల రుణ భారం, కొన్ని ఎగవేతల ప్రభావం ఉంది. కానీ, రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీలోని ఐదు వ్యాపారాలు కూడా రెండంకెల స్థాయిలో వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, బ్రోకరేజీ, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రాణిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలో కార్పొరేట్‌, పర్సనల్‌ లోన్‌ బుక్‌ రెండంకెల స్థాయిలో వృద్ధి ఉంది. అన్ని వ్యాపారాల్లోనూ ఈక్విటీపై రాబడుల శాతం 12 నుంచి 15 శాతం వరకు ఉంది. ఇదే వృద్ధి ఇకముందూ కొనసాగే అవకాశం కూడా ఉంది. You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎప్పుడు అమ్మాలి?

Wednesday 5th September 2018

పెట్టుబడులు పెట్టేందుకు వందల సంఖ్యలో ఉన్న ఫండ్స్‌ నుంచి ఏ పథకాలను ఎంచుకోవాలన్నది క్లిష్టమైన పనే. చాలా మంది ఆన్‌లైన్‌ పోర్టళ్లు, రికమండేషన్ల ఆధారంగా అడుగులు వేస్తుంటారు. కొందరు అడ్వైజర్ల సూచనలు తీసుకుంటుంటారు. కానీ, కొనడం కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ను విక్రయించడమే అతిపెద్ద టాస్క్‌ అంటున్నారు వ్యాల్యూ రీసెర్చ్‌ అధినేత ధీరేంద్ర కుమార్‌. ఎప్పుడు విక్రయించాలనే విషయమై పలు అంశాలను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు.    ‘‘ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయించడానికి ఎన్నో

కొనసాగిన నష్టాలు

Wednesday 5th September 2018

మార్కెట్‌ నష్టాల పరంపర ఆగడం లేదు. రూపాయి వరుసగా ఆరోరోజూ కొత్త కనిష్టాలకు పతనం కావడం, బాండ్‌ఈల్డ్స్‌ 4ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూలాంశాలు ఇందుకు కారణమయ్యాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిశాయి.  సెన్సెక్స్‌ 140 పాయింట్ల నష్టంతో 38,018 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 11,477 వద్ద ముగిశాయి. ఓ దశలో నిఫ్టీ

Most from this category