STOCKS

News


సాంక్టమ్‌ వెల్త్‌ నుంచి వాల్యూ రికమండేషన్లు

Tuesday 10th July 2018
Markets_main1531205575.png-18163

వచ్చే ఒకటిరెండు నెలల్లో దాదాపు 16 శాతం వరకు రాబడినిచ్చే ఐదు వాల్యూ స్టాకులను సాంక్టమ్‌వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రికమండ్‌ చేసింది..
1. యస్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 410. స్టాప్‌లాస్‌ రూ. 348. గత సంవత్సరకాలంగా రూ. 285- 380 మధ్య కన్సాలిడేషన్‌ చెందింది. ఇటీవలే వీక్లీ చార్టుల్లో ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌నెస్‌కు సంకేతం. ఎంఏసీడీ సైతం పాజిటివ్‌ క్రాసోవర్‌ఏర్పరిచింది. బోలింగర్‌ బ్యాండ్‌ విస్తరించడంతో పాటు రేంజ్‌ బ్రేకవుట్‌చూపింది. గత మూడు సెషన్లలో భారీ వాల్యూంలతో కూడిన కొనుగోళ్లు జరిగాయి. త్వరలో అప్‌మూవ్‌కు రెడీగా ఉందని ఇండికేటర్లు చెబుతున్నాయి. 
2. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 310. స్టాప్‌లాస్‌ రూ. 253. సంవత్సర కాలంలో రూ. 195- 250 రేంజ్‌లో ఒక రౌండింగ్‌ బాటమ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. మేలో ఈ పాటర్న్‌ నుంచి అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించి రూ. 270 స్థాయిలకు చేరింది. అక్కడ కన్సాలిడేషన్‌ ఆరంభించి ఇంతవరకు రూ. 250- 270 శ్రేణిలో కదలాడుతూ వచ్చింది. తాజాగా బోలింగర్‌ బ్యాండ్‌లో పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచి కొత్త అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తోంది. 
3. మారుతీ సుజుకీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 10400. స్టాప్‌లాస్‌ రూ. 9050. హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. గత డిసెంబర్‌లో ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం కరెక‌్షన్‌, తదనంతరం కన్సాలిడేషన్‌కు గురైంది. తాజాగా అధోముఖ నిరోధ వాలు రేఖను పైవైపుగా ఛేదించి లాంగ్‌ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏ‍ర్పరిచి తదుపరి అప్‌మూవ్‌ను ఖరారు చేసింది. ఇతర ఇండికేటర్లు కూడా పాజిటివ్‌గా మారాయి.
4. కేపీఐటీ టెక్నాలజీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 265. ఏడాది కాలంగా అప్‌ట్రెండ్‌లోనే ఉంది. గతనెల ఆల్‌టైమ్‌ హై రూ.290ని తాకి వెనుదిరిగింది. అప్పటినుంచి కన్సాలిడేషన్‌ చెందుతూ సౌష్టవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ను ఏర్పరిచింది. తాజాగా ఈ పాటర్న్‌ నుంచి పైవైపుకు బ్రేకవుట్‌ సాధించేందుకు రెడీగా ఉంది. ఇందుకు తగ్గట్లే చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఏర్పరుస్తోంది. వాల్యూంలు కూడా బలంగా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
5. బెర్గర్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 350. స్టాప్‌లాస్‌ రూ. 285. సంవత్సరకాలంగా రూ. 230- 280 మధ్య కన్సాలిడేట్‌ అవుతోంది. మేలో ఈ స్థిరీకరణ దశ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. అనంతరం మరోమారు మైనర్‌ కన్సాలిడేషన్‌ చూపింది. తాజాగా అధిక వాల్యూంలతో కూడిన కొనుగోళ్ల మద్దతు పొందుతోంది. బోలింగర్‌ బ్యాండ్‌లో పాజిటివ్‌సంకేతాలు వస్తుండగా, ఎంఏసీడీలో బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. త్వరలో మరో అప్‌మూవ్‌కు రెడీగా ఉంది. You may be interested

రూపాయి విలువ 72 స్థాయికి తగ్గొచ్చు..!

Tuesday 10th July 2018

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అడ్డుకున్నప్పటికీ.. ఇది కేవలం తాత్కాలిక చర్యగానే ఉండనుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. పలు భారత కంపెనీలు విదేశాల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల తిరిగి చెల్లింపులకు సమయం దగ్గర పడుతుండడం, మండుతున్న ముడిచమురు ధరల కారణంగా మారకం విలువ మరంత కనిష్టస్థాయిలకు పడిపోయే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. రూపాయి విలువను నిలబెట్టడంలో భాగంగా ఆర్బీఐ

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ/ముంబై:- బ్రెగ్జిట్‌ సంక్షోభం మరోసారి తెరపైకి రావడంతో పాటు డాలర్‌ విలువ నెలరోజుల కనిష్టస్థాయిలో కొనసాగుతుండంతో ప్రపంచవ్యాప్తంగా మంగళవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం గం.11:15లకు ఔన్స్‌ పసిడి ధర 1:03 డాలర్లు పెరిగి 1,260.9 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది.  బ్రెగ్జిట్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంతో  ప్రధాని థెరీసా మే అనుసరిస్తున్న వ్యూహాలను తప్పుబడుతూ సోమవారం బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్

Most from this category