News


రెండు రంగాలపై యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సానుకూలం

Wednesday 26th December 2018
Markets_main1545846951.png-23244

మార్కెట్‌ మొత్తం మీద 60-70 శాతం స్టాక్స్‌ పనితీరు వెనుకబడి ఉన్నంత మాత్రాన బేర్‌ మార్కెట్‌ అని చెప్పడం సరికాదని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫండ్‌ మేనేజర్‌ వి. శ్రీవాస్తవ అన్నారు. బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లు సానుకూలంగా ఉన్నాయని, ఇతర మార్కెట్లతో పోలిస్తే మంచి పనితీరు చూపించాయన్నారు. సమీప కాలంలో సాధారణ ఎన్నికలే మార్కెట్ల విషయంలో అనిశ్చితికి దారితీసే అంశంగా పేర్కొన్నారు. మన దేశంలో పెట్టుబడులను నిర్వహించే కొందరు లేదా ఇన్వెస్టర్లు ఇది బేర్‌ మార్కెట్‌గా భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు మార్కెట్లపై ఒత్తిడి ఉంటుందని, ఇవి సైడ్‌వేస్‌లో ఉండొచ్చని... ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతల నేపథ్యంలో మన దగ్గరా మార్కెట్ల గమ్యం ప్రతికూలంగానే ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

కొన్ని రంగాలను గమనిస్తే... పెద్ద ఎత్తున విక్రయాల కారణంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఉదాహరణకు ఆటోమొబైల్‌ రంగాన్ని పేర్కొన్నారు. ‘‘ఈ రంగం గత కొన్నేళ్లుగా స్థిరమైన పనితీరు చూపించింది. గత ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో మొదటి సారిగా ఈ రంగం పనితీరు మొత్తం మార్కెట్‌తో పోలిస్తే నిదానించింది. దీర్ఘకాలంలో ఈ రంగం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. విస్తృతి తక్కువగా ఉండడం, మంచి క్యాష్‌ ఫ్లో, ఆర్‌వోసీఈ, వ్యయాల పరంగా పోటీతత్వం సానుకూలతలు. పనితీరు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ రంగం వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. స్వల్పకాలం పాటు డిమాండ్‌ అంశాల వల్లే ఇది చోటు చేసుకుంది. మరో ఏడాది తర్వాత ఈ పరిస్థితి ఉండదు. దీర్ఘకాలంలో చూస్తే ఈ తరహా రంగాలు స్వల్పకాలం పాటు సవాళ్లను అధిగమించి మరీ మంచి పనితీరు చూపిస్తాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే చాలా సహేతుక వ్యాల్యూషన్ల వద్ద స్టాక్స్‌ ఉన్నాయి’’ అని శ్రీవాస్తవ వివరించారు. 

 

ఇతర రంగాలను చూస్తే... ముఖ్యంగా ఐటీ గత ఏడాది కాలంలో మంచి పనితీరు చూపించిందని, గత మూడు నెలల్లో రూపాయి లాభపడడం వల్ల ఈ రంగం షేర్ల ధరలు తగ్గాయన్నారు. తిరిగి వీటి వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారాయని పేర్కొన్నారు. మార్కెట్‌తో పోలిస్తే తక్కువకే లభిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని కంపెనీల వద్ద దండిగా నగదు నిల్వలు ఉన్నాయని, వాటిని వాటాదారులకు పంపిణీ చేయనున్నట్టు విశ్లేషించారు. ఏ తరహా రాజకీయ అనిశ్చితి అయినా హెడ్జ్‌ చేసుకునేందుకు ఈ రంగాన్ని సూచించారు. ఐటీ రంగం భారత ఆర్థిక రంగంతో పెద్దగా ముడిపడి లేకపోవడమే కారణంగా పేర్కొన్నారు. ఐటీ కంపెనీల ఆదాయం ప్రధానంగా అమెరికా, యూరోప్‌ మార్కెట్ల నుంచి వచ్చే విషయం తెలిసిందే. కనుక దీర్ఘకాలానికి ఆటోమొబైల్‌, ఐటీ తరహా రంగాలను ఎంచుకోవచ్చని శ్రీవాస్తవ సూచించారు.You may be interested

మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు ఆకర్షణీయం: పొరింజు

Wednesday 26th December 2018

వచ్చే ఏడాది స్టాక్స్‌ కొనుగోలుకు అద్భుత అవకాశాలు ఉంటాయని ప్రముఖ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా సంస్థ ఎండీ పొరింజు వెలియాత్‌ అన్నారు. ఇది బోటమ్‌అప్‌ విధానంలో ఉంటుందన్నారు. ఎంపిక చేసిన స్టాక్స్‌ కొనుగోళ్లపై దృష్టి సారించొచ్చని సూచించారు. నిఫ్టీకి బయట మంచి వృద్ధికి అవకాశాలున్న స్టాక్స్‌ ఎన్నో ఉన్నాయని పేర్కొ‍న్నారు. 2019లో స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ రివకరీ అవుతాయన్న ఆశాభవం వ్యక్తం చేశారు. పొరింజు స్మాల్‌క్యాప్‌ సిగార్‌గా

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌

Wednesday 26th December 2018

మిడ్‌సెషన్‌ నుంచి వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుధవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల రికవరీ కారణంగా సూచీల మూడు రోజు నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ సూచి 179 పాయింట్ల లాభంతో 35,650 వద్ద, నిఫ్టీ సూచీ 66పాయింట్ల లాభంతో 10,730 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలతో భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 400పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 100

Most from this category