STOCKS

News


ర్యాలీల్లో షార్ట్‌ చేయండి!

Saturday 29th September 2018
Markets_main1538215398.png-20716

చార్ట్‌వ్యూ ఇండియా సూచన

ఆల్‌టైమ్‌ హై 11760 పాయింట్లను చేరిన తర్వాత ఆగకుండా దాదాపు 8 శాతం మేర నిఫ్టీ పతనమైంది. ఈ నేపథ్యంలో సూచీల్లో కొంతమేర పుల్‌బ్యాక్‌ ర్యాలీ రావచ్చని చార్ట్‌వ్యూ ఇండియా అంచనా వేసింది. అందువల్ల కనిష్ఠస్థాయిల్లో షార్ట్‌ చేయవద్దని, కాస్త పెరిగిన సమయాలను షార్ట్‌ చేయడానికి వినియోగించుకోవాలని సూచించింది. 10866 పాయింట్ల వద్ద నిఫ్టీకి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోందని విశ్లేషించింది. ఈ స్థాయిని రెండు మార్లు తాకినా దిగువకు రాకపోవడం మద్దతుకు సంకేతమని తెలిపింది. అందువల్ల ఈ స్థాయిని కాపాడుకున్నంతవరకు నిఫ్టీలో​ కాస్త రికవరీ ఆశించవచ్చని తెలిపింది. 10860 పాయింట్ల దిగువన నిఫ్టీ క్లోజయితే దాన్ని మరింత బేరిష్‌ సంకేతంగా భావించాలని తెలిపింది. రాబోయే వారం పుల్‌బ్యాక్‌ ఎంతవరకు ఉంటుందో గమనించాలి. నిఫ్టీ 11170 పాయింట్ల పైన క్లోజ్‌ అయితే బుల్స్‌కు పట్టు చిక్కుతుంది. అంతవరకు పెరిగినప్పుడు అమ్ము సూత్రం పాటించవచ్చు. ఈ స్థాయికి పైన 11350 పాయింట్ల వద్ద మరో బలమైన నిరోధం ఉంది. ఈ స్థాయిలకు పైన నిలదొక్కుకోవడం కష్టమయితే మరో కరెక‌్షన్‌ ఉండొచ్చు.

ఈ ఏడాదికి 11760 పాయింట్లే అత్యధిక స్థాయి అని చార్ట్‌వ్యూ ఇండియా అభిప్రాయపడింది. అక్టోబర్‌ సీరిస్‌లో సైతం సూచీల్లో ఒత్తిళ్లు కొనసాగుతాయని తెలిపింది. క్రమంగా 10850 పాయింట్లను ఈ సీరిస్‌, వచ్చే సీరిస్‌లో బ్రేక్‌డౌన్‌ చేయవచ్చని అంచనా వేసింది. ఈ పతనం ఎంత వరకు కొనసాగవచ్చని భిన్నాభిప్రాయాలున్నాయని తెలిపింది. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 10500- 10700 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ కావచ్చని అంచనా వేసింది. ఈ స్థాయి కూడా రక్షించలేకపోతే 9950 పాయింట్లను మరోమారు పరీక్షించే అవకాశముందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన షేర్లను దీర్ఘకాలానికి ఎంచుకోవాలని సూచించింది. 11500 పాయింట్లకు పైన ట్రేడయితే మార్కెట్‌ ధృక్పథం బుల్లిష్‌గా మారుతుందని తెలిపింది. ఇప్పుడున్న అనిశ్చితుల్లో ట్రేడర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 



You may be interested

పీ/ఈతో పాటు పీ/ఎస్‌ కూడా అవసరమే!

Saturday 29th September 2018

టెక్నికల్‌ ఎనాలసిస్‌లో కీలకం మార్కెట్‌తో పరిచయం ఉన్నవారికి పీఈ నిష్పత్తి తెలుసు. పీఈ ఎక్కువగా ఉంటే వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నాయని అర్దం. ఒక కంపెనీ వృద్ధి అవకాశాలు పెరిగినా, ఆర్‌ఓఈ పెరిగినా పీఈ పెరుగుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పీఈ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రంగంలో అఅధిక పీఈ ఉన్న కంపెనీలతో పోలిస్తే అల్ప పీఈ ఉన్న కంపెనీల షేర్లపై మదుపు చేస్తుంటారు. అధిక పీఈ సర్దుబాటు అయ్యేందుకు

డాలర్‌.. ఓవర్‌ వాల్యూడ్‌!

Saturday 29th September 2018

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నివేదిక యూఎస్‌లో మందగమనం వచ్చే అవకాశాలు బాగా తగ్గాయని, క్రమంగా వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్‌ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలు డాలర్‌ ఇండెక్స్‌లో పరుగులకు దారితీసాయి. ఈ ఏడాది పలు కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బాగా బలపడుతోంది. ఫిబ్రవరి నుంచి డీఎక్స్‌వై(డాలర్‌ ఇండెక్స్‌) ఆరు శాతం లాభపడింది. యూఎస్‌ ఎకానమీ మంచి వృద్ధి నమోదు చేస్తుండడం, ఫెడ్‌ రేట్లను పెంచడంతో డాలర్‌పై పెట్టుబడులు పెరిగాయి. ఇదే సమయంలో వర్ధమాన కరెన్సీలు

Most from this category