STOCKS

News


ర్యాలీలో వైదొలగండి..

Tuesday 11th September 2018
Markets_main1536648606.png-20164

ఆరు వారాలుగా లాభాల్లో ముగుస్తూ వచ్చిన మార్కెట్‌ సోమవారం ఒక శాతంమేర పడిపోయింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేస్తున్నారు. దేశీ గణాంకాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణం. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమౌతునే ఉండటం సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లతోపాటు సెక్టోరల్‌ ఇండెక్స్‌లు కూడా పడిపోతున్నాయి. మొత్తం మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.    
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, బలహీనమైన రూపాయి వంటి అంశాలు ప్రస్తుతం మార్కెట్‌ను నిర్దేశిస్తున్నాయని తెలిపారు. గరిష్ట స్థాయిల్లో నిలకడ అనేది క్లిష్టతరమైన అంశమని, మార్కెట్‌ మళ్లీ పెరిగినప్పుడు లెవరేజ్‌ పొజిషన్లు తగ్గించుకోవాలని సూచించారు. నిఫ్టీ 11,700-11,800 శ్రేణిలో నిరోధాన్ని కలిగి ఉండొచ్చన్నారు. ప్రస్తుతం నిఫ్టీకి తర్వాతి కీలక మద్దతు స్థాయి 11,300 అని తెలిపారు. అలాగే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఆటో, ఫార్మా, ఐటీ, మెటల్‌ స్టాక్స్‌ చూడటానికి బలంగా కనిపిస్తున్నాయని తెలిపారు. పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ షేర్లపై ఒత్తిడి కొనసాగవచ్చనఅ అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు స్టాక్‌ ఎంపికపై, పొజిషన్‌ మేనేజ్‌మెంట్‌ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
ఆయన వచ్చే నెల రోజుల్లో 5-8 శాతం రాబడులను అందించే స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  

స్టాక్‌: టాటా కెమికల్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.780
స్టాప్‌ లాస్‌: రూ.720
రిటర్న్‌ అంచనా: 5.4 శాతం
టాటా కెమికల్స్‌ స్టాక్‌ గత తొమ్మిది నెలలుగా తన గరిష్ట స్థాయి వల్ల బ్రాడనింగ్‌ ఫార్మెషన్‌లో ట్రేడ్‌ అవుతూ ఉంది. ఇటీవలనే ప్యాట్రన్‌ అప్పర్‌ బాండ్‌ను తాకింది. ప్రస్తుతం ప్రాఫిట్‌ బుకింగ్‌ జరుగుతోంది. స్టాక్‌ను కొనుగోలు చేయడానికి ఇది మంచి అవకాశం. ట్రేడర్లు రూ.730-740 స్థాయిల్లో కొత్తగా మరిన్ని షేర్లను కొనుగోలు చేయవచ్చు. 

స్టాక్‌: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
రేటింగ్‌: ఫ్యూచర్లను విక్రయించొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.85
స్టాప్‌ లాస్‌: రూ.96
రిటర్న్‌ అంచనా: 8.1 శాతం 
ఇటీవలి రికవరీని మినహాయిస్తే పీఎస్‌యూ బ్యాంకులు బలహీనంగానే ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇందుకు మినహాయింపేమీ కాదు. మల్టీపుల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ స్థాయి అయి 100 సమీపంలో నిరోధ స్థాయిని అధిగమించడంలో విఫలమైంది. ట్రేడర్లు రూ.92.50-93.50 రేంజ్‌లో షాట్‌ తీసుకుంటే మంచిది.  

స్టాక్‌: అశోక్‌ లేలాండ్‌
రేటింగ్‌: ఫ్యూచర్లను విక్రయించొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.122
స్టాప్‌ లాస్‌: రూ.136
రిటర్న్‌ అంచనా: 7.4 శాతం
అశోక్‌ లేలాండ్‌ స్టాక్‌ ఇటీవల రికవరీ అయ్యింది. ప్రస్తుతం డైలీ చార్ట్‌లో మల్టీపుల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ జోన్‌ వద్ద నిరోధ స్థాయిని దాటడానికి ఇబ్బంది పడుతోంది. సమీప కాలంలో బ్రేక్‌ డౌన్‌ అయ్యే అవకాశముంది. స్టాక్‌లో ఏ కొంచెం పెరుగుదల కనిపించినా ట్రేడర్లు రూ.131-132 రేంజ్‌లో షాట్‌ పొజిషన్‌ తీసుకోవచ్చు. You may be interested

ఐటీకి ‘అప్‌గ్రేడ్‌’ అవ్వొచ్చా?

Tuesday 11th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇతర రంగాలకన్నా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ఉత్తమమైన పనితీరు కనబరుస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 రికార్డ్‌ స్థాయికి పతనం కావడం బాగా కలిసొచ్చింది. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మెక్వైరీ.. రూపాయి పతనం వల్ల ఐటీ వృద్ధి పుంజుకోవచ్చని అంచనా వేస్తోంది. పరిశ్రమలోని ట్రెండ్స్‌ కూడా వృద్ధి వేగాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మెక్వైరీ పలు కంపెనీల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది.

ఆరునెలల కనిష్టానికి ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌

Tuesday 11th September 2018

3శాతం నష్టపోయిన ఐటీసీ ముంబై:- పలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో మంగళవారం ఎన్‌ఎస్‌ఈలోని ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) సూచి ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 30,845.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఎఫ్‌ఎంసీజీ షేర్లలోని ప్రధాన షేర్లైన ఐటీసీ, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రోడెక్ట్స్‌, కాల్గేట్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌(హెచ్‌యుఎల్‌), మారికో, జుబిలెంట్‌ ఫుడ్స్‌

Most from this category