STOCKS

News


క్యాలెండర్‌ స్ప్రెడ్‌ వ్యూహంపై కన్నేయండి!

Friday 7th June 2019
Markets_main1559893826.png-26158

నిఫ్టీ ఆప్షన్స్‌పై నిపుణుల సూచన
మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న వేళ ట్రేడర్లు కాలెండర్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వ్యూహంలో దిగువ స్థాయికి చెందిన అదే నెల పుట్‌ను విక్రయించి, తదుపరినెలకు చెందిన అంతకన్నా తక్కువ పుట్‌ను కొనుగోలు చేస్తారు. దీనివల్ల అనుకున్నదాని కన్నా డౌన్‌సైడ్‌ రిస్కులు పెరిగితే హెడ్జ్‌కు పనికివస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం ప్రకారం 11400 పుట్‌ను విక్రయించి, 11200 పుట్‌ను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకవేళ జూన్‌5 చివరకు మార్కెట్‌ 11400 దిగువకు చేరకపోతే నష్టం పరిమితంగా ఉంటుంది, అదే అనుకున్న పతనం వస్తే అమ్మిన పుట్‌లో వచ్చే నష్టం కన్నా కొన్న పుట్‌లో వచ్చే లాభం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం 11400(జూన్‌) పుట్‌ను షేరు ఒక్కింటికి 38 రూపాయల చొప్పున విక్రయించి, 11200(జూలై) పుట్‌ను షేరు ఒక్కింటికి 57 రూపాయల చొప్పున కొనడం జరుగుతుంది. అంటే మొత్తం కొనుగోలు ధర 57- 38= 19 రూపాయలవుతుంది. అంటే వ్యూహంలో వచ్చే మొత్తం నష్టం 19రూపాయలుంటుంది. నిఫ్టీ జూన్‌ చివరకు 11400 వద్ద ముగిస్తే అమ్మిన పుట్‌ విలువ శూన్యమవుతుంది, ఇదే సమయంలో కొన్న పుట్‌ ప్రీమియం టైమ్‌ వాల్యూ కారణంగా భారీగా పెరుగుతుంది. ఒకవేళ నిఫ్టీ జూన్‌లో 11200 వరకు పతనమైతే అమ్మిన ఆప్షన్‌ ఖరీదు రూ.200పర్‌షేర్‌ అవుతుంది. ఇదే సమయంలో కొన్న పుట్‌ ప్రీమియం అంతకన్నా ఎక్కువుంటుంది.

జూలై5న బడ్జెట్‌ నేపథ్యంలో ఒడిదుడుకులు పెరుగుతాయని అంచనా ఉంది కాబట్టి, కొనుగోలు చేసిన పుట్‌తో లాభం అధికంగా ఉంటుంది. ఈ వ్యూహంలో టైమ్‌వాల్యూ, తీవ్ర కదలికలు అధిక ప్రభావం చూపుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యూహం సత్ఫలితాలు ఇస్తునందని క్రాసీస్‌ క్యాపిటల్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ బహెతి, మోతీలాల్‌ఓస్వాల్‌ చందన్‌ తపారియా, కేడియా కమోడిటీస్‌కు చెందిన నితిన్‌ కేడియా తదితరులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక పరిణామాలు నెగిటివ్‌గా ఉండడం, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం.. ఈ వ్యూహాన్ని ఫలవంతం చేస్తాయని తపారియా చెప్పారు. షేర్‌ఖాన్‌ టెక్నికల్‌ హెడ్‌ రోహిత్‌ శ్రీవాస్తవ సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. 



You may be interested

కొనసాగుతున్న అనిల్‌ అంబానీ షేర్ల పతనం

Friday 7th June 2019

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్ల పతనం శుక్రవారం  కొనసాగుతుంది. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 15శాతం క్షీణించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌ షేర్లు 14శాతం నష్టపోయాయి. వాటితో పాటు రిలయన్‌ క్యాపిటల్‌ 12శాతం, రిలయన్స్‌ హోమ్స్‌ 10శాతం, రిలయన్స్‌ పవర్‌ 10శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌4శాతం, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ షేర్లు 3శాతం క్షీణించాయి.  15ఏళ్ల కనిష్టానికి రిలయన్స్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌:- నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.83.60ల

ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 7th June 2019

ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,943.15 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్లో జరిగిన అమ్మకాల్లో భాగంగా ఇండెక్స్‌ 0.75శాతం(230 పాయింట్లు) నష్టపోయి 30,627.05 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదు చేసింది. అయితే, సమయం గడుస్తున్న కొద్ది ఇన్వెస్టర్లు క్రమంగా కొనుగోళ్లుకు మొగ్గుచూపడంతో సూచీలు తిరిగిలాభపడ్డాయి. ఈ

Most from this category