STOCKS

News


ఆర్జన సరే.. ఆసలు జాగ్రత్త!

Monday 17th September 2018
Markets_main1537181674.png-20332

స్టాక్‌ మార్కెట్‌ గురు వారెన్‌ బఫెట్‌ ప్రముఖ సూత్రం తెలుసుగా.. ‘‘ ఎప్పుడూ నష్టపోవద్దు’’..

దీన్ని మరికొంత విస్తరించి చెబుతున్నాడు ప్రముఖ ఇన్వెస్టర్‌ ప్రభాకర్‌.

పెట్టుబడిపై ఆర్జించకున్నా ఫర్వాలేదు కానీ నష్టాలు మాత్రం మూటకట్టుకోవద్దని ఆయన వివరిస్తున్నాడు. 

 

మంగుళూరుకు చెందిన ప్రభాకర్‌ పోర్టుఫోలియో ఈ ఏడాది నిఫ్టీతో పోలిస్తే 30 శాతం అధిక రాబడినిచ్చింది. నిజానికి మార్కెట్లో సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో, పోగొట్టుకోకుండా ఉండడం అంతకన్నా ముఖ్యమని ఆయన తరుచూ చెబుతుంటారు. మార్కెట్లో పెట్టిన పెట్టుబడితో లాభం పొందడం ద్వారా తదుపరి మరింత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం కద్దు. లాభం మాట దేవుడెరుగు ఉన్న పెట్టుబడినే నష్టపోతే దాన్ని మరింత పెంచడమనేది జరగదని ప్రభాకర్‌ హెచ్చరిస్తున్నారు. తాను పలు సంవత్సరాలుగా ఈ రూల్‌ను పాటిస్తూ ఉన్నానన్నారు. మార్కెట్లో ప్రతిసారీ ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చని కానీ పెట్టుబడి పోగొట్టుకోవడం కనురెప్పపాటులో జరుగుతుందని చెప్పారు. అందువల్ల ఆర్జన కన్నా అసలును జాగ్రత్తగా ఉంచుకోవడంపై అధిక శ్రద్ధ పెట్టాలని సూచించారు. 
ఎప్పుడు కొనాలి?
సమయానుగత కరెక‌్షన్స్‌ వచ్చినప్పుడు మార్కెట్లో కొనుగోళ్లకు దిగాలని ప్రభాకర్‌ సలహా ఇచ్చారు. ఒక్కోసారి సూచీల్లో అనుకోని కరెక‌్షన్‌ వచ్చి కొన్ని స్టాకులు అత్యంత ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద దొరుకుతుంటాయని, అప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి అవకాశాల కోసం ఎప్పుడూ కొంత మొత్తాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా ఒక అంచనాను అందుకున్న స్టాకుపై మోహం వదిలి లాభాన్ని స్వీకరించాలని చెప్పారు. స్టాక్‌ టెర్మినల్‌ వాల్యూ వద్ద వదిలించుకోవాలని సూచించారు. బడా స్టాకులను నిర్ణీత వ్యవధిలో అమ్మడం ద్వారా లాభాలు స్వీకరించి కావాలంటే తదుపరి పతనంలో మరలా ఎంటర్‌ కావాలని చెప్పారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్లు వార్తలను బట్టి కాకుండా కంపెనీల వ్యాపారాలను అధ్యయనం చేయడం ద్వారా పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు. అదేవిధంగా లాంగ్‌టర్మ్‌ ధృక్పథంతో మార్కెట్లోకి రావాలని చెప్పారు. మల్టీబ్యాగర్లను వేటాడడం చెత్త ఆలోచన అని, కేవలం బలమైన వ్యాపారమూలాలున్న కంపెనీలు ఎంచుకోవడమే ఇన్వెస్టర్‌ చేయాలని సూచించారు. You may be interested

ఐటీ -టు- ఫార్మా

Monday 17th September 2018

ఐటీ నుంచి ఫార్మాకు మారాల్సిన సమయం వచ్చిందంటున్నారు ఏస్‌ప్రో అడ్వైజర్స్‌ భాగస్వామి, సీఐవో కుంజ్‌ బన్సాల్‌. గేమ్‌లో భాగంగా ప్రకటనలు వస్తుంటాయని, అయితే ఎగ్జిక్యూషన్‌ పరంగా చూస్తే ఎలాంటి ప్రకటనలు ఉండవని, వీటి ఆధారంగానే మార్పు ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్థూల ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయని, వాటిని మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రయత్నింస్తోందని తెలిపారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో చెప్పుకోదగ్గవేవీ

బేర్స్‌ గుప్పిట్లో సూచీల విలవిల

Monday 17th September 2018

సెన్సెక్స్‌ 500 పాయింట్లు లాస్‌ 11400 దిగువకు నిఫ్టీ ముంబై:- మార్కెట్‌ను మరోసారి బేర్స్‌ హడలెత్తించారు. సూచీల రెండు రోజుల లాభాలకు చెక్‌ పెడుతూ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే బేర్స్‌ హల్‌చల్‌ చేశాయి. వాణిజ్య యుద్ధ భయాలు తెరపైకి రావడం, రూపాయి పతనం మళ్లీ మొదలవడం, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు బెడిసి కొట్టడం, మార్కెట్‌ నుంచి తరలిపోతున్న విదేశీ నిధులు, సాంకేతిక కారణాలు మార్కెట్లో బేర్స్‌ పట్టును సాధించడానికి

Most from this category