STOCKS

News


నష్టాల్లోనే అమెరికా మార్కెట్‌

Saturday 27th October 2018
Markets_main1540617591.png-21529

మూడవ త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదైనప్పటికీ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు నిరుత్సాహ ఎర్నింగ్స్‌ను ప్రకటించడంతో అక్కడి మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ప్రధాన ఇండెక్స్‌లు 1 శాతానికిపైగానే పడిపోయాయి. ఇక నాస్‌డాక్‌ 2 శాతానికిపైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.19 శాతం లేదా 296 పాయిం‍ట్ల నష్టంతో 24,688 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 500 పాయింట్లకుపైగా పడిపోయింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.73 శాతం లేదా 47 పాయింట్ల నష్టంతో 2,659 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.07 శాతం లేదా 151 పాయింట్ల నష్టంతో 7,167 పాయింట్ల వద్ద ముగిసింది. అమెజాన్‌ స్టాక్‌ దాదాపు 8 శాతంమేర పతనమైంది. ఇక అల్ఫాబెట్‌ షేరు దాదాపు 2 శాతంమేర క్షీణించింది. 

వారంగా చూస్తే.. డౌజోన్స్‌ 3 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 3.9 శాతం, నాస్‌డాక్‌ 3.8 శాతంమేర పతనమయ్యాయి. ఇక అక్టోబర్‌ నెలలో ఇప్పటి దాకా చూస్తే.. ఎస్‌అండ్‌పీ 500.. 8.8 శాతం, డౌజోన్స్‌ 6.7 శాతం, నాస్‌డాక్‌ 11 శాతం క్షీణించాయి. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు శుక్రవారం క్షీణించడంతో 2018లో నెగటివ్‌లోకి వచ్చేశాయి. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే నాస్‌డాక్‌ ఇంకా 3.8 శాతం లాభాల్లోనే ఉంది.  
 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 5% జంప్‌..

Saturday 27th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగితే, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత ఏడీఆర్‌లు క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా తగ్గింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.69 శాతం క్షీణతతో 11.59 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.99

ఆసియా మార్కెట్లు డౌన్‌..

Saturday 27th October 2018

ఆసియా స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 84 పాయింట్ల నష్టంతో 21,184 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 41 పాయింట్ల నష్టంతో 2,972 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల నష్టంతో 9,489 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,598 పాయింట్లకు తగ్గింది. దక్షిణ కొరియా

Most from this category