అమెరికా మార్కెట్లకు ఈల్డ్స్ దెబ్బ
By Sakshi

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 180 పాయింట్ల నష్టంతో 26,447 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంటెల్, క్యాటర్‌పిల్లర్ షేర్లు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్అండ్పీ 500.. 0.6 శాతం నష్టపోయి 2,885 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ రంగం సరైన పనితీరు కనబర్చకపోవడం ఇందుకు కారణం. ఇండెక్స్ ఈ వారం మొత్తంగా 1 శాతంమేర పడిపోయింది. ఇండెక్స్‌కు వారం వారీగా నెల రోజుల్లో ఇదే చెత్త ప్రదర్శన. ఇక నాస్డాక్ కంపొసిట్ 1.2 శాతంమేర నష్టపోయి 7,788 పాయింట్ల వద్ద ముగిసింది. అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్ షేర్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. వారంలో ఈ ఇండెక్స్ 3.2 శాతంమేర పతనమైంది. మార్చి 23 నాటి వారం దగ్గరి నుంచి చూస్తే ఇండెక్స్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రధమం. ఆ వారంలో ఇండెక్స్ 6.5 శాతంమేర క్షీణించింది. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 3.24 శాతానికి పెరిగాయి. 2011 గరిష్ట స్థాయిని తాకాయి. రెండేళ్ల బాండ్ ఈల్డ్స్ 2.87 శాతానికి ఎగశాయి. ఎంప్లాయిమెంట్ గణాంకాలు బలంగా ఉన్నాయి. నిరుద్యోగిత 1969 కనిష్ట స్థాయి 3.7 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనలు పెరిగాయి. ఇవన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.
You may be interested
వేదాంత ఏడీఆర్ రివర్స్..
Saturday 6th October 2018అమెరికా స్టాక్ మార్కెట్లోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. తటస్థంగా ఉంది. ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం పెరిగింది. వేదాంత ఏడీఆర్ ఎక్కువగా పడిపోయింది. టాటా మోటార్స్ ఏడీఆర్ 2.75 శాతం క్షీణతతో 14.52 డాలర్లకు తగ్గింది.
ఆసియా స్టాక్ సూచీలకు నష్టాలు..
Saturday 6th October 2018ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. జపాన్ నికాయ్ 225.. ఏకంగా 192 పాయింట్ల నష్టంతో 23,784 పాయింట్లకు తగ్గింది. దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,268 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్ కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 51 పాయింట్ల నష్టంతో 26,572 పాయింట్లకు క్షీణించింది. సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 22 పాయింట్ల నష్టంతో 3,209 పాయింట్లకు తగ్గింది. తైవాన్ సూచీ