STOCKS

News


7 ఏళ్ల తర్వాత అదిరిపోయే పనితీరు

Saturday 1st December 2018
Markets_main1543645561.png-22560

అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.79 శాతం లేదా 200 పాయిం‍ట్ల లాభంతో 25,538 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.81 శాతం లేదా 22 పాయింట్ల లాభంతో 2,759 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.79 శాతం లేదా 57 పాయింట్ల లాభంతో 7,330 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికం, యుటిలిటీస్‌, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు ర్యాలీ చేశాయి. జీ-20 సదస్సులో అమెరికా, చైనా అధ్యక్షుల భేటీలో వాణిజ్య ఉద్రిక్తతలకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చనే అంచనాలు మార్కెట్‌పై పాజిటివ్‌ ప్రభావం చూపాయి. 2011 డిసెంబర్‌ నుంచి చూస్తే ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు వారంలో ఈ మేర ఉత్తమ పనితీరు కనబర్చడం ఇదే తొలిసారి. 2016 నవంబర్‌ నుంచి చూస్తే నాస్‌డాక్‌ ఇండెక్స్‌ వారంలో ఈ స్థాయి పనితీరు కనబర్చడం ఇదే ప్రథమం. వారంగా చూస్తే నాస్‌డాక్‌ 5.6 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 4.9 శాతం, డౌజోన్స్‌ 5.2 శాతం లాభపడ్డాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే.. నాస్‌డాక్‌ 6.2 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 3.2 శాతం, డౌజోన్స్‌ 3.3 శాతం పెరిగాయి. 



You may be interested

కొస్పి డౌన్‌.. మిగతావి అప్‌..

Saturday 1st December 2018

దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,117 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 3 పాయింట్ల లాభంతో 9,888 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 21 పాయింట్ల లాభంతో 2,588 పాయింట్ల వద్ద ఉంది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి

నవంబర్‌ మారుతి అమ్మకాలు మందగించాయ్‌

Saturday 1st December 2018

మారుతి విక్రయాలు నవంబర్‌లో స్వల్పంగా మందగించాయి. ఎంట్రీ లెవల్‌ కార్లకు డిమాండ్‌ పెరగడం, ఎగుమతులు భారీగా క్షీణించడటం విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్‌లో మొత్తం 1.53లక్షల యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన మొత్తం 1.54లక్షల యూనిట్లతో పోలిసే ఇది 0.7శాతం తక్కువ. మిని సిగ్మెంట్‌ విభాగంలోని అల్టో, వేగానర్‌ కార్ల అమ్మకాలు ఈ నెలలో 21.6శాతం క్షీణించాయి. గతేడాది నవంబర్‌లో ఈ విభాగంలో మొత్తం 38,204

Most from this category