STOCKS

News


డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ అప్‌.. నాస్‌డాక్‌ డౌన్‌..

Saturday 17th November 2018
Markets_main1542428612.png-22110

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.49 శాతం లేదా 123 పాయిం‍ట్ల లాభంతో 25,413 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.22 శాతం లేదా 6 పాయింట్ల లాభంతో 2,736 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.15 శాతం లేదా 11 పాయింట్ల నష్టంతో 7,247 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌విడియా షేరు దాదాపు 19 శాతం మేర పతనం కావడం నాస్‌డాక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 2019 క్యూ3లో కంపెనీ ఆదాయం, గైడెన్స్‌ నిరుత్సాహపరచడం ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనాతో వాణిజ్య పరమైన డీల్‌ కుదరచ్చని ఆశాభావం వ్యక్తంచేయడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. 
వారంగా చూస్తే.. ఎస్‌అండ్‌పీ 500.. 1.6 శాతం మేర పడిపోయింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌, నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పతనమయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500లో మార్కెట్‌ క్యాప్‌ పరంగా అతిపెద్ద రంగమైన టెక్నాలజీ.. వారంలో ఎక్కువగా 2.5 శాతంమేర నష్టపోయింది. యాపిల్‌ షేరు 5.4 శాతం తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. ఐఫోన్‌ విక్రయాలు తగ్గొచ్చనే అంచనాలు ఇందుకు కారణం. అలాగే అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ షేర్లు వరుసగా 7 శాతం, 5.7 శాతం క్షీణించాయి. ఫేస్‌బుక్‌ కూడా దాదాపు 4 శాతం మేర పడిపోయింది.   



You may be interested

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..

Saturday 17th November 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 29 పాయింట్ల లాభంతో 3,083 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 9,797 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,679 పాయింట్ల వద్ద ముగిసింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,092 పాయింట్ల

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Saturday 17th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 81 పాయింట్ల లాభంతో 10,779 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,687 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఇక అమెరికా

Most from this category