News


లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 16th February 2019
Markets_main1550305322.png-24218

చైనాతో వాణిజ్య చర్చలు సఫలవమచ్చనే ఆశావహనంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వాషింగ్టన్‌లో వచ్చే వారంలో కూడా చైనాతో వాణిజ్య చర్చలు కొనసాగుతాయి. చైనా దిగుమతులపై అదనపు సుంకాల విధింపునకు తుది గడువు మార్చి 1వ తేది నాటికి ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభింవచ్చని ఆశిస్తునట్లు శుక్రవారం వైట్‌హౌస్‌ ఓ అధికార ప్రకటనతో తెలిపింది. గోల్డ్‌మెన్‌ శాచ్స్‌, జేపీ మోర్గాన్‌ లాంటి ఆర్థిక షేర్ల ర్యాలీతో డోజోన్స్‌ 444 పాయింట్ల లాభంతో 25,883.25 వద్ద ముగిసింది. వరుసగా 8 ట్రేడింగ్‌ సెషన్లు లాభపడిన ఈ సూచీ ఈ వారం మొత్తం మీద 3.1శాతం బలపడింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన రంగ షేర్లు ర్యాలీ చేయగా, వాటితో హెల్త్‌ సెక్టార్‌ షేర్లు సైతం లాభాల బాట పట్టాయి. ఫలితంగా ఎస్‌అండ్‌పీ 30 పాయింట్ల లాభంతో 2,775.60 వద్ద, నాక్‌డాక్‌  45 పాయింట్ల లాభంతో 7,472.41 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా మార్కెట్లను ఇది వరుసగా 3వ వారం లాభాల ముగింపు కావడం విశేషం.



You may be interested

అమెరికాలో మాంద్యం సంకేతాలు?!

Saturday 16th February 2019

ఒకపక్క ట్రేడ్‌వార్‌ సమసిపోలేదు.. మరోపక్క అంతర్జాతీయంగా వృద్ది నెమ్మదిస్తోంది. ఇవన్నీ కలిసి క్రమంగా యూఎస్‌ ఎకానమీలో మరోమారు మాంద్యాన్ని సృష్టించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం తప్పదన్న సంబంధించి సంకేతాలు కనిపిస్తున్నాయని ఎక్కువమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది వృద్ది పాజిటివ్‌గానే ఉంటుందని ఒకపక్క అనలిస్టులంతా అభిప్రాయపడుతున్నారు. కానీ మరోపక్క మాంద్యం ముంచుకొచ్చే అవకాశాలు ఆరేళ్ల గరిష్ఠాలకు చేరాయని గుర్తు చేస్తున్నారు. యూఎస్‌ ఎకానమీ ఇటీవల కాలంలో గత

‍స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th February 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి 10762.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10746.55 పాయింట్లతో పోలిస్తే 16పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ లాభంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ లాభాల్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక మనమార్కెట్‌ విషయానికొస్తే ... కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి

Most from this category