అమెరికా మార్కెట్లు శుభారంభం
By Sakshi

అమెరికా మార్కెట్లు నాల్గవ త్రైమాసికానికి శభారంభాన్ని ఇచ్చాయి. నాస్డాక్ మినహా మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లోనే ముగిశాయి. అమెరికా, కెనడా ట్రేడ్ డీల్ సానుకూల ప్రభావం చూపింది. నాస్డాక్ ఇండెక్స్ స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్, ఎస్అండ్పీ 500 ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 192 పాయింట్ల లాభంతో 26,651 పాయింట్ల వద్ద ముగిసింది. చెవ్రాన్, బోయింగ్ ఔట్‌పర్ఫార్మ్ చేశాయి. ఇక ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రీయల్ షేర్లు లాభపడటంతో ఎస్అండ్పీ 500.. 11 పాయింట్ల లాభంతో 2,925 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఫేస్బుక్, ఇంటెక్స్ షేర్లు నష్టపోవడంతో నాస్డాక్ కంపొసిట్ 9 పాయింట్ల నష్టంతో 8,037 పాయింట్ల వద్ద ముగిసింది. మెక్సికో, అమెరికా, కెనడా దేశాలు నాఫ్తా స్థానంలో కొత్త వాణిజ్య భాగస్వామ్యానికి కుదర్చుకున్నాయి. ఈ కొత్త డీల్ పేరు యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా అగ్రిమెంట్. అలాగే జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో జాన్ ఫ్లానరీ పదవీ నుంచి వైదొలగడం, టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్, ఎస్సీఈ (సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్) మధ్య డీల్ కుదరడం వంటి అంశాలు కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. జనరల్ ఎలక్ట్రిక్ షేర్లు 7 శాతం మేర పెరిగాయి. టెస్లా షేరు ఏకంగా 17 శాతంమేర ర్యాలీ చేసింది. జనరల్ ఎలక్ట్రిక్ మార్కెట్ వ్యాల్యు గత వారంలో 100 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఇలా జరగడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ నుంచి ఈ కంపెనీ జూన్‌లోనే స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.
You may be interested
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దిగువకు
Tuesday 2nd October 2018ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 11,053 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ సోమవారం ముగింపు స్థాయి 11,061 పాయింట్లతో పోలిస్తే 8 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ రోజంతా ఇదే ట్రెండ్‌లో ఉండి.. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా
ఆసియా మార్కెట్లు డౌన్..
Tuesday 2nd October 2018ఒక్క జపాన్ మార్కెట్ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్ నికాయ్ 225.. 37 పాయింట్ల లాభంతో 24,283 పాయింట్లకు పెరిగింది. దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 17 పాయింట్ల నష్టంతో 2,322 పాయింట్ల వద్ద, హాంగ్ కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ ఏకంగా 438 పాయింట్ల నష్టంతో 27,350 పాయింట్ల వద్ద, సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో