STOCKS

News


వాల్‌ స్ట్రీట్‌ మళ్లీ ఢమాల్‌..

Saturday 8th December 2018
Markets_main1544248082.png-22765

  • శుక్రవారం భారీగా పతనమైన ఇండెక్స్‌లు
  • డౌజోన్స్‌ 559 పాయింట్లు డౌన్‌
  • వారంలో 4 శాతానికి పైగా క్షీణించిన ఇండెక్స్‌లు

అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ భారీగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోతే. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.24 శాతం లేదా 559 పాయిం‍ట్ల నష్టంతో 24,388 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.33 శాతం లేదా 63 పాయింట్ల నష్టంతో 2,633 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.05 శాతం లేదా 219 పాయింట్ల నష్టంతో 6,969 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక వృద్ధి మందగమనం, నవంబర్‌ ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదు కావడం, వాషింగ్టన్‌- బీజింగ్‌ మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతల పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు పడిపోయాయి. మార్చి నుంచి చూస్తే ఇండెక్స్‌లు వారం వారీగా ఈ స్థాయిలో నష్టపోవడ ఇదే ప్రథమం. వారంలో ఇండెక్స్‌లు 4 శాతానికి పైగా క్షీణించాయి. డౌజోన్స్‌ 4.5 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 4.6 శాతం, నాస్‌డాక్‌ 4.9 శాతం పతనమయ్యాయి. 2008 నుంచి చూస్తే డిసెంబర్‌ నెలను ఇండెక్స్‌లు ఇంత చెత్తగా ప్రారంభించడం ఇదే తొలిసారి. డౌజోన్స్‌ మూడు రోజుల్లో ఏకంగా 1,400 పాయింట్ల మేర పతనమైంది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ నష్టాల్లోనే ఉన్నాయి. నాస్‌డాక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. 



You may be interested

ఇండియన్‌ ఏడీఆర్‌లు డౌన్‌..

Saturday 8th December 2018

వేదాంత ఏడీఆర్‌ 2 శాతానికి పైగా పతనం అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లన్నీ తగ్గాయి. వేదాంత ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పడిపోతే.. మిగతా వాటి ఏడీఆర్‌లు 1 శాతానికి పైగా క్షీణించాయి.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.75

ఆసియా మార్కెట్లు: ఆ రెండూ నష్టాల్లో..

Saturday 8th December 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. హాంగ్‌ సెంగ్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌లు నష్టపోతే.. మిగిలిన ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 4 పాయింట్ల నష్టంతో 3,111 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 76 పాయింట్ల లాభంతో 9,760 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 1 పాయింటు లాభంతో 2,605 పాయింట్ల వద్ద ఉంది.

Most from this category