STOCKS

News


అమెరికా మార్కెట్ల ర్యాలీ

Thursday 8th November 2018
Markets_main1541650639.png-21781

మధ్యంతర ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడటంతో అమెరికా మార్కెట్లు బుధవారం ర్యాలీ చేశాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరును కొనసాగించేందుకు పాలసీ రూపకల్పనలో డెమోక్రాట్స్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలివ్వడం సానుకూల ప్రభావం చూపింది. ప్రధాన ఇండెక్స్‌లు 2 శాతానిపైగా ఎగశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.13 శాతం లేదా 545 పాయిం‍ట్ల లాభంతో 26,180 పాయింట్ల వద్ద ముగిసింది. యునైటెడ్‌ హెల్త్‌కేర్‌, యాపిల్‌ షేర్లు లాభపడటం ఇందుకు కారణం. ఎస్‌అండ్‌పీ 500.. 2.12 శాతం లేదా 58 పాయింట్ల లాభంతో 2,813 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెల్త్‌కేర్‌, టెక్నాలజీ, కన్సూమర్‌ డిస్క్రీషనరీ రంగాల షేర్ల పెరుగుదల ఇందుకు కారణం. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.64 శాతం లేదా 195 పాయింట్ల నష్టంతో 7,570 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడటం అక్టోబర్‌ 16 నుంచి ఇదే ప్రథమం. ఇక ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఈ మేర లాభపడటం అక్టోబర్‌ 25 నుంచి ఇదే తొలిసారి. ‘అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇవి మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. అయితే ఇప్పుడు ఆ ఆందోళనలు సమసిపోయాయి. మార్కెట్లు రికవరీ బాట పట్టాయి’ అని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. కాగా బుధవారం వెల్లడైన అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ.. ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్)లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ.. సెనేట్‌లో ఆధిక్యం సాధించింది.   

 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ అప్‌..

Thursday 8th November 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక్క విప్రో మినహా మిగతా అన్ని స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు ఎక్కువ వ్యాల్యుమ్స్‌తో పెరిగాయి. ఇక వేదాంత ఏడీఆర్‌లో ఎక్కువ వృద్ధి కనిపించింది. విప్రో ఏడీఆర్‌ స్వల్పంగా తగ్గింది. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.31 శాతం లాభంతో 13.18 డాలర్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.37

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Thursday 8th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:16 సమయంలో 8 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,614 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా, ఇదే ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే

Most from this category