STOCKS

News


అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌

Saturday 13th October 2018
Markets_main1539407326.png-21100

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 287 పాయిం‍ట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం మొత్తంగా చూస్తే ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 4.1 శాతం, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 4.2 శాతం, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.7 శాతం నష్టపోయాయి. అలాగే ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.72 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 3.32 శాతం, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 6.63 శాతం లాభపడ్డాయి. అమెరికాలో శుక్రవారం నాడు అక్కడి దిగ్గజ బ్యాంకులు అదిరిపోయే ఎర్నింగ్స్‌ ప్రకటించడంతో ఫైనాన్షియల్‌ రంగ షేర్లు బాగా పెరిగాయి. అలాటే టెక్నాలజీ, కన్సూమర్‌ డిస్క్రీషనరీ స్టాక్స్‌ కూడా లాభపడ్డాయి.  



You may be interested

ఆసియా మార్కెట్లు జోరు..

Saturday 13th October 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత లాభాలను పెంచుకుంటూ వెళ్లాయి. చివరకు జపాన్‌ నికాయ్‌ 225.. 104 పాయింట్ల లాభంతో 22,695 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 535 పాయింట్ల లాభంతో 25,801 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల లాభంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి..

Saturday 13th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో 10,518 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,486 పాయింట్లతో పోలిస్తే 32 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  కాగా ముడి చమురు ధరలు చల్లబడటం, రూపాయి రికవరీ కావడం వంటి సానుకూలాంశాల కారణంగా

Most from this category