STOCKS

News


మరింత పెరిగిన పసిడి

Thursday 31st January 2019
Markets_main1548912229.png-23915

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో కీలక వడ్డీరేట్లపై యథాతధ స్థితిని కొనసాగించే దిశగా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు వెలువరించడంతో గురువారం పసిడి ధర మరింత ఎగిసింది. ఇది 8నెలల గరిష్టస్థాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి 10డాలర్లు ర్యాలీ చేసి 1,320.20 డాలర్ల గరిష్టాన్ని తాకింది. వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ మెతక వైఖరీ కారణంగా డాలర్‌ విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. మరోవైపు చైనా టెలికాం దిగ్గజం హువాయ్‌ కంపెనీ సీఎఫ్‌ఓతో మరో ఇద్దరు అధికారులపై అమెరికా క్రిమినల్‌ ఛార్జ్‌షీట్‌ ధాఖలు చేయడంతో వాణిజ్య చర్చల విజయవంతంపై ఇన్వెస్టర్లలో అనుమానాలు రేకెత్తాయి. ఈ కారణంగా ఒకవేళ చర్చలు విఫలమైతే అమెరికా మార్చి 2 నుంచి చైనా దిగుమతులపై టారీఫ్‌లను రెట్టింపు చేసే అవకాశాలు లేకపోతేదని మార్కెట్‌ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరత.. పసిడి ధరకు 1300స్థాయిపైన సమంజసమే. స్వల్ప కాలంలోనే 1300 స్థాయిపైన స్థిరపడే అవకాశం ఉంది. అయితే 1350 డాలర్ల స్థాయిని అందుకోవడానికి మాత్రం మార్కెట్‌ మరోసారి భారీ అస్థిరతకు లోను కావాల్సి ఉంటుంది.’’ అని సీనియర్‌ బులియన్‌ విశ్లేషకుడు జెఫ్రీ హాలీ అభియప్రాయపడుతున్నారు.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీ ర్యాలీ చేస్తున్నప్పటికీ.., దేశీయంగా మాత్రం స్వల్పంగానే లాభపడింది. గురువారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర స్వల్పంగా రూ.54.00లు పెరిగి రూ.32965.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి సుంకాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేబోయే బడ్జెట్‌ కై ఎదురుచూస్తుంది. ఒకవేళ బడ్జెట్‌ ప్రజాకర్షకంగా ఉన్నట్లైతే పసిడి ధరను ప్రభావితం చూపే రూపాయి బలహీనపడుతుంది. ఇది పసిడి ధరకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 You may be interested

కోబ్రా కథనం అసత్యం

Thursday 31st January 2019

ఖండించిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విక్రయం ! ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ ఆన్‌లైన్‌​ న్యూస్‌ పోర్టల్‌, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన వార్త సత్యదూరమని ఆ కంపెనీ ఖండించింది. ఎలాంటి డొల్ల కంపెనీలకు రుణాలివ్వలేదని, పార్టీలకు విరాళాలు ఇచ్చామనడం కూడా అబద్ధమేనని కంపెనీ చైర్మన్‌ కపిల్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. వికాస్‌ శేఖర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కోబ్రాపోస్ట్‌ సత్యదూరమైన కథనాన్ని పోస్ట్‌ చేసిందని విమర్శించారు.

తనఖా.. తడాఖా చూపిస్తోంది!

Thursday 31st January 2019

భారీగా షేర్లను కుదువ పెడుతున్న ప్రమోటర్లు జీ షేర్ల పతనంతో ఉలిక్కిపడ్డ మార్కెట్‌- రుణదాతల విక్రయంతో ఈ  కంపెనీలు మరింత పతనం- ప్రమోటర్ల తనఖా షేర్లు పెరిగితే ప్రమాదమే!- దూరంగా ఉంటేనే మేలంటున్న నిపుణులు (సాక్షి, బిజినెస్‌ విభాగం) ప్రమోటర్లు తమ వాటాలను తనఖా పెట్టి... వాటిపై భారీగా రుణాలు తీసుకుని... ఆ రుణాలను వేరేచోట పెట్టుబడులుగా పెట్టడం ఇపుడు కొత్త సమస్యలకు దారితీస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ షేర్ల ఉదంతంతో ఇలాంటి కంపెనీలపై

Most from this category