STOCKS

News


ఫెడ్‌ మీటింగ్‌పై మార్కెట్‌ అంచనాలేంటి?

Tuesday 18th December 2018
Markets_main1545114995.png-23042

అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం ప్రారంభమైంది. బుధవారం అర్ధ రాత్రి పాలసీ నిర్ణయం వెలువడనుంది. దీని ఆధారపడి సమీప కాలంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఉండొచ్చు. 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉంటుందని మార్కెట్‌ అంచనాకు వచ్చిందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌) రాజేశ్‌ పాల్వియా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫెడరల్‌ రిజర్వు తాజా సమావేశంలో 2019లో వడ్డీ రేట్ల పెంపుపై తన విధానాన్ని ప్రకటిస్తుందని పేర్కొన్నారు. 

11,000 వద్ద గట్టి నిరోధం 
మన మార్కెట్లను టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 11,000 స్థాయిని అధిగమించడం కష్టతరమని రాజేశ్‌ పాల్వియా తెలిపారు. డిసెంబర్‌లో 10,600- 11,000 శ్రేణిలో కదలాడవచ్చని అంచనా వేశారు. నిఫ్టీ 11,000 స్థాయి సమీపానికి వెళ్తే ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచంచారు. అలాగే సమీప కాలంలో కరెక‌్షన్‌ సంభవిస్తే.. అప్పుడు 10,700 స్థాయి సమీపంలో లాంగ్‌ పొజిషన్ల తీసుకోవచ్చని తెలిపారు. డెలివేటివ్స్‌ విషయానికి వస్తే 10,500- 11,000 శ్రేణిని దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను రచించుకోవాలని సూచించారు. సెన్సెక్స్‌కు 36,000 వద్ద గట్టి నిరోధాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. ఇక నిఫ్టీ 11,000 స్థాయి నుంచి గట్టి ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. వీక్లి చార్ట్స్‌ పరంగా చూస్తే నిఫ్టీ ఇండెక్స్‌ బుల్షి​ క్యాండిల్‌ను ఏర్పరచిందని తెలిపారు. నిఫ్టీ 10,850 స్థాయిని అధిగమించి, ఆపైన స్థిరపడితే.. అప్పుడు ఇండెక్స్‌ 10,900- 11,000 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. డెరివేటివ్‌ డేటా ప్రకారం చూస్తే 11,000 స్థాయి వద్ద కాల్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువ ఉందని, ఇది ఈ నెలలో ఇండెక్స్‌కు గట్టి నిరోధంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయిని దాటితే అప్పుడు షార్ట్‌ కవరింగ్‌ వల్ల 11,300- 11,550 స్థాయికి చేరొచ్చని పేర్కొన్నారు. ఇకపోతే ఇండెక్స్‌కు 10,700, 10,600 కీలక మద్దతు స్థాయిలని తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ, మోమెంటమ్‌ అస్కిలేటర్‌ స్టోచాస్టిక్‌ రెండూ కూడా మార్కెట్లు సమీప కాలంలో కన్సాలిడేట్‌ అవ్వొచ్చని సూచిస్తున్నాయి. 

మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌పై..
నాణ్యమైన మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ఇటీవలి కాలంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని రాజేశ్‌ పాల్వియా తెలిపారు. స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లు 50 రోజుల సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌ను (ఎస్‌ఎంఏ) అధిగమించి, పైస్థాయిల్లోనే స్థిరపడ్డాయని పేర్కొన్నారు. అయితే 100 రోజలు, 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌లకు దిగువునే ఉన్నాయని తెలిపారు. అందువల్ల పైస్థాయిలో సరఫరా ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న, మంచి ఎర్నింగ్స్‌ను సాధిస్తున్న స్టాక్స్‌ ర్యాలీ చేస్తాయని తెలిపారు. అందువల్ల నాణ్యమైన మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌ షేర్లను పడ్డప్పుడల్లా కొనుగోలు చేయవచ్చని సూచించారు. 

ఔట్‌పర్ఫార్మర్‌గా బ్యాంక్‌ నిఫ్టీ

ఇటీవలి కాలంలో నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఔట్‌పర్ఫార్మ్‌ చేసిందని రాజేశ్‌ పాల్వియా తెలిపారు. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఇప్పుడు తన 50, 100, 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌లకు పైనే ఉందని పేర్కొన్నారు. ఇది బ్యాంకింగ్‌ విభాగంలో కొనుగోళ్లను సూచిస్తోందని తెలిపారు. సమీప కాలంలో బ్యాంక్‌ నిఫ్టీకి 27,100 వద్ద గట్టి నిరోధం ఎదురవ్వొచ్చని పేర్కొన్నారు. ఇండెక్స్‌ ఈ స్థాయిని అధిగమిస్తే 27,500- 27,800 స్థాయికి పెరగొచ్చని తెలిపారు. అదేసమయంలో 26,400 వద్ద ఇండెక్స్‌కు కీలక మద్దతు ఉందని పేర్కొన్నారు. ఒకవేళ బ్యాంక్‌ నిఫ్టీ 26,400 దిగువకు పడిపోతే అప్పుడు ఇండెక్స్‌ 26,100- 25,800 స్థాయికి చేరొచ్చు. 



You may be interested

వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Tuesday 18th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.282 టార్గెట్‌ ప్రైస్‌: రూ.355 కోటక్‌ సెక్యూరిటీస్‌.. వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై సానుకూలంగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.355గా నిర్ణయించింది. ట్రకింగ్‌ విభాగంలో బలమైన పనితీరు, దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అమలు, సానుకూల నిబంధనలు, దేశీ వ్యాపారం మెరుగుదల, డీజిల్‌ ధరల

లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 18th December 2018

మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఇంట్రాడేలో పలు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1శాతం ర్యాలీ చేసింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకం ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ అనుసరిస్తున్న కఠినవైఖరిని సడలించడంతో పాటు, మొండి బకాయిలతో కష్టాల్లో ఉన్న బ్యాంకులకు మూలధనం

Most from this category