STOCKS

News


ఒడిదుడుకుల వారం..!

Monday 13th May 2019
Markets_main1557729803.png-25704

- చైనా ఉత్పత్తుల‌పై భారీగా సుంకాన్ని పెంచిన అమెరికా
- అమెరికా–ఇరాన్‌ల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు 
- సోమవారం సీపీఐ, మంగళవారం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు
- డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యూపీఎల్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో ఫలితాలు ఈవారంలోనే..

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల వేడి, స్థూల ఆర్థిక అంశాల నేపథ్యంలో.. ఈవారం మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ‘చైనా ఉత్పత్తుల‌పై అమెరికా సుంకాన్ని ప‌ది శాతం నుంచి ఒక్కసారిగా 25 శాతానికి పెంచగా.. ఈ చ‌ర్యకు ప్రతిచ‌ర్య త‌ప్పదని చైనా కూడా ప్రకటన చేసి వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరంచేసింది. ఈ అంశం మార్కెట్లో ఒడిదుడుకులను పెంచేందుకు అవకాశం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. మరోవైపు ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా.. ఆదేశంతో యుద్ధానికి సన్నద్ధమైనట్లు ప్రకటించి స్టాక్‌ మార్కెట్లో ఆందోళన మరింత పెంచింది. ఇక దేశీయంగా సార్వత్రిక ఎన్నికల చివరి అంకానికి చేరుకోగా.. ఈ అంశం అత్యంత కీలకంగా ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. ముడి చమురు ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంటే మాత్రం ప్రతికూలత మరింత పెరగక తప్పదని అంచనా.

గణాంకాలపై దృష్టి...
ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సోమవారం, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మంగళవారం వెల్లడికానున్నాయి. మే 10తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు డేటా శుక్రవారం విడుదలకానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా ఏప్రిల్ నెల పారిశ్రామిక ఉత్పత్తి డేటా మంగళవారం, రిటైల్‌ అమ్మకాల గణాంకాలు బుధవారం వెల్లడికానున్నాయి.

ఈవారంలోనే పలు దిగ్గజ కంపెనీల ఫలితాలు ...
ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం ఐటీసీ, హౌసింగ్ డెవెలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, వోడాఫోన్ ఐడియా, జస్ట్ డయల్ సంస్థలు మే 13న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. నెస్లే ఇండియా మంగళవారం.. లుపిన్‌ బుధవారం.. బజాజ్ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో గురువారం.. బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), యూపీఎల్‌ శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్నాయి.

వెనక్కి తగ్గుతున్న ఎఫ్‌ఐఐలు...
వరుసగా మూడు నెలలపాటు దేశీ మార్కెట్లో పెట్టుబడులను కుమ్మరించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ).. వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఒక్కసారిగా వెనక్కితగ్గారు. ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,207 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. మే 2–10 మధ్యకాలంలో రూ.1,345 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.4,552 కోట్లను వెనక్కుతీసుకుని, నికరంగా రూ.3,207 కోట్లను ఉపసంహరించుకున్నారు. You may be interested

సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయంపై కేంద‍్రం కసరత్తు

Monday 13th May 2019

  ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయడంపై దృష్టి లిస్టులో ఎయిరిండియా, స్కూటర్స్ ఇండియా, బీఈఎంఎల్ మొదలైన సంస్థలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆసక్తి గల ఇన్వెస్టర్లకు సమాచార పత్రాలు జారీ చేసిన నాలుగు నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తయ్యేలా చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. "ప్రస్తుతం వ్యూహాత్మక వాటాల విక్రయానికంటూ విధానం అమల్లో ఉన్నప్పటికీ..

కరెన్సీ నోట్లను గుర్తించేందుకు మొబైల్ యాప్‌

Monday 13th May 2019

న్యూఢిల్లీ: కంటి చూపు లేని వారు కూడా దేశీ కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. దీన్ని రూపొందించేందుకు టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్స్ ఆహ్వానించింది. నోట్లను మొబైల్ కెమెరా ముందు ఉంచినప్పుడు వాటి విలువను రెండు సెకన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలోనే తెలియజెప్పగలిగే విధంగా యాప్ ఉండాలని ఇందుకు సంబంధించిన ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. వాయిస్ ఆప్షన్‌తోను,

Most from this category