STOCKS

News


మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు ఆకర్షణీయం: పొరింజు

Wednesday 26th December 2018
Markets_main1545847065.png-23245

వచ్చే ఏడాది స్టాక్స్‌ కొనుగోలుకు అద్భుత అవకాశాలు ఉంటాయని ప్రముఖ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా సంస్థ ఎండీ పొరింజు వెలియాత్‌ అన్నారు. ఇది బోటమ్‌అప్‌ విధానంలో ఉంటుందన్నారు. ఎంపిక చేసిన స్టాక్స్‌ కొనుగోళ్లపై దృష్టి సారించొచ్చని సూచించారు. నిఫ్టీకి బయట మంచి వృద్ధికి అవకాశాలున్న స్టాక్స్‌ ఎన్నో ఉన్నాయని పేర్కొ‍న్నారు. 2019లో స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ రివకరీ అవుతాయన్న ఆశాభవం వ్యక్తం చేశారు. పొరింజు స్మాల్‌క్యాప్‌ సిగార్‌గా పేరొందిన విషయం తెలిసిందే. ఆయన నిర్వహించే పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కే చోటిస్తుంటారు. అయితే, 2018 సంవత్సరంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ బేలచూపులు చూడడంతో పొరింజు నిర్వహించే పోర్ట్‌ఫోలియో నిర్వహణ ఆస్తుల విలువ సైతం పెద్ద మొత్తంలో కరిగిపోయింది. 

 

మిడ్‌క్యాప్‌ ఐటీ స్టాక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని పొరింజు చెప్పారు. వీటిల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, మంచి వృద్ధికి అవకాశాలున్నాయన్నారు. ఇన్ఫోసిస్‌ తరహా లార్జ్‌క్యాప్‌ కంపెనీలు కూడా మంచి పనితీరు నమోదు చేస్తాయన్న ఆయన ఎక్కువ రిటర్నులు మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీల్లో సాధ్యమన్నారు. ఎన్నికలు, రాజకీయాలు ప్రధాన భూమిక పోషించినాగానీ... భారత మార్కెట్‌ పట్ల బేరిష్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నారు. దేశ అభివృద్ధి కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు ముఖ్యమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేశామని, వాటి నుంచి వెనక్కి మళ్లడానికి అవకాశం లేదన్నారు. హెల్త్‌కేర్‌, హాస్పిటల్‌ రంగాల విషయంలో తాను నిపుణుడుని కాదని, అయితే, రానున్న కాలంలో ఈ రంగం మంచి పనితీరు చూపిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎంపిక చేసిన స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు.
 You may be interested

గురువారం ప్రభావిత షేర్లు

Thursday 27th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా:- పేటెంట్‌ ఉల్లంఘన కేసులో తన అనుబంధ సంస్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీకి కోర్టు నుంచి ఊరట లభించింది. ఎన్‌టీపీసీ:- బిల్హాపూర్‌ సోలార్‌ పీవీ ప్రాజెక్ట్స్‌, ఆరియా  సోలార్‌ ప్లాంట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌:- కేర్‌ రేటింగ్‌ సం‍స్థ ఇటీవల జారీ రూ.715 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ(+) రేటింగ్‌ను కేటాయించింది. విస్తా ఫార్మాస్యూటికల్స్‌:- కంపెనీ

రెండు రంగాలపై యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సానుకూలం

Wednesday 26th December 2018

మార్కెట్‌ మొత్తం మీద 60-70 శాతం స్టాక్స్‌ పనితీరు వెనుకబడి ఉన్నంత మాత్రాన బేర్‌ మార్కెట్‌ అని చెప్పడం సరికాదని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫండ్‌ మేనేజర్‌ వి. శ్రీవాస్తవ అన్నారు. బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లు సానుకూలంగా ఉన్నాయని, ఇతర మార్కెట్లతో పోలిస్తే మంచి పనితీరు చూపించాయన్నారు. సమీప కాలంలో సాధారణ ఎన్నికలే మార్కెట్ల విషయంలో అనిశ్చితికి దారితీసే అంశంగా పేర్కొన్నారు. మన దేశంలో పెట్టుబడులను

Most from this category