STOCKS

News


నెల రోజుల్లో భారీగా పెరిగిన షేర్లివి!

Thursday 18th April 2019
Markets_main1555610391.png-25213

ఫిబ్రవరి మధ్య నుంచి విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో మన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నూతన గరిష్టాలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 11 వరకు కేవలం 36 సెషన్లలో సెన్సెక్స్‌ 3,200 పాయింట్లు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోనే తిరిగి ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఈ ర్యాలీకి తోడ్పడ్డాయని అనలిస్టుల అంచనా. అయితే, ఈ 32 సెషన్లలో కొన్ని స్టాక్స్‌ మాత్రం విపరీతంగా పెరిగేశాయి. 

 

స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ బిల్‌ ఎనర్జీ, జ్యోతి స్ట్రక్చర్స్‌, జైబాలాజీ ఇండస్ట్రీస్‌, ఓసీఎల్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, వీకేజే ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, మీనాక్షి ఎంటర్‌ప్రైజెస్‌, శ్రీ ప్రీకోటెడ్‌ స్టీల్స్‌, నింబస్‌ ఫుడ్స్‌ ఇండస్ట్రీస్‌, వికాస్‌ డబ్ల్యూఎస్‌పీ 100 శాతం నుంచి 400 శాతం మధ్య పెరగడం గమనార్హం. బ్రోడర్‌ మార్కెట్‌ రికవరీ కొనసాగుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బాగా పడిపోయిన నాణ్యమైన స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాలన్నది వారి సూచన. వచ్చే 12 నెలల కాలంలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు ప్రదర్శి‍స్తాయని కోటక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ అంచనా వేస్తోంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 11 శాతం, స్మాల్‌క్యాప్‌ 14 శాతం మేర ఫిబ్రవరి 19-ఏప్రిల్‌ 11 మధ్య పెరిగాయి. 

 

భారీగా ర్యాలీ చేసిన ఇతర స్టాక్స్‌ను పరిశీలిస్తే... ఆధునిక్‌ మెటాలిక్స్‌, వికాస్‌ ప్రొపంట్‌ అండ్‌ గ్రానైట్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జోడియాక్‌ క్లాతింగ్‌, ఇండియాబుల్స్‌ ఇంటెగ్రేటెడ్‌ సర్వీసెస్‌, సోరిల్‌ ఇన్‌ఫ్రా, మ్యాట్రిమోనీ డాట్‌ కామ్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు తదితర 58 స్టాక్స్‌ 50-100 శాతం మధ్యలో ర్యాలీ చేశాయి. అయితే, ఈ జాబితాలో మెజారిటీ స్టాక్స్‌ గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 మధ్య కాలంలో 90 శాతం వరకు పతనమైనవే. ‘‘బలమైన ర్యాలీ జరిగినప్పటికీ 2019లో ఈక్విటీలు మరింత ఎగువ వైపునకు ర్యాలీ చేస్తాయి. 2019-20 రెండో అర్ధ భాగంలో ఆర్థిక రంగం వేగాన్ని పుంజుకుంటుంది. మూలధన వ్యయాలు పుంజుకుంటాయి. ఇది కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధికి దారితీస్తుంది. మెరుగైన వృద్ధి గణాంకాలు, సానుకూల ఎన్నికల ఫలితాలు మార్కెట్లను తదుపరి దశకు తీసుకెళతాయి’’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. 

 

రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, మన్‌పసంద్‌ బెవరేజెస్‌, తల్వాల్కర్‌ బెటర్‌ వ్యాల్యూ ఫిట్‌నెస్‌, సన్‌టెక్‌ రియాలిటీ, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, ప్రభాత్‌ డెయిరీ, పీసీ జ్యుయలర్‌ 10 నుంచి 50 శాతం వరకు గత నెలన్నర రోజుల్లో ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ, రిలాక్సో ఫుట్‌వేర్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, బెర్జర్‌ పెయింట్స్‌, ఆర్‌ఐఎల్‌, ఐవోఎల్‌ కెమికల్స్‌, మెర్క్‌, నిట్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ గేతడాది లాభాలను కొనసాగించాయి. మధ్య మధ్యలో అస్థిరతలు ఉన్నా కానీ 2019 సంవత్సరం ఈక్విటీ మార్కెట్లు ఎన్నో అవకాశాలను కల్పిస్తాయని సెంట్రల్‌ వెల్త్‌ రీసెర్చ్‌ పేర్కొంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలతో ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని సూచించింది.You may be interested

నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Friday 19th April 2019

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. మార్కెట్లో ట్రేడింగ్‌ తిరిగి సోమవారం మొదలవుతుంది. 

187 కంపెనీల్లో పెరిగిన ఎఫ్‌ఐఐల వాటా

Thursday 18th April 2019

ఫిబ్రవరి నుంచి మార్చి చివరికి రూ.40,000 కోట్లను మన మార్కెట్లలోకి పంప్‌ చేసిన విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు... మొత్తం మీద మార్చి త్రైమాసికంలో 187 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. అదే సమయంలో 200 కంపెనీల్లో లాభాలు తీసుకుని వాటాలు తగ్గించుకున్నట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.   ఏప్రిల్‌ 12 నాటికి వెలుగు చూసిన కంపెనీల వాటాదారుల వివరాలను పరిశీలించగా... యాక్సిస్‌ బ్యాంకు, యూపీఎల్‌, పీఎన్‌బీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసీసీ,

Most from this category