STOCKS

News


మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 3rd December 2018
Markets_main1543825433.png-22593

అమెరికా - చైనాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధ సంధి మెటల్‌ షేర్లకు కలిసొస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా మెటల్స్‌ ఉత్పత్తిదారుగా పేరొందిన చైనాపై అమెరికా టారీఫ్‌లను సడలించడంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు లాభాల బాట పట్టాయి. ధరల పెరుగుదలతో ఈ రంగానికి చెంది షేర్లు కూడా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతానికి పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3,163.75)తో పోలిస్తే 2.50శాతం లాభంతో 3,245.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 15 షేర్లకు గానూ 14 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క జేఎస్‌ఎల్‌హిస్సార్‌ షేరు అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా జిందాల్‌స్టీల్‌ 7శాతం లాభపడింది. వేదాంత 5శాతం, హిందాల్కో, సెయిల్‌ 3శాతం, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ 1.50శాతం, ఏపిల్‌ అపోలో, నాల్కో 1శాతం లాభపడ్డాయి, వెల్‌స్పాన్‌కార్ప్‌, ఎన్‌ఎండీసీ, మెయిల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో వేదాంత స్టీల్‌ 5శాతం లాభంతో టాప్‌-5 గెయినర్లలో రెండవ స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

నెలరోజుల కోసం 10 సిఫార్సులు

Monday 3rd December 2018

ముంబై: గతనెలలో నిఫ్టీ మూడు శాతం మేర లాభపడింది. నవంబర్‌ 30 ముగింపుతో ఈసూచీ 200-రోజుల సగటు కదలికల స్థాయి అయిన 10,800 పాయింట్ల ఎగువకు చేరింది. సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ డిసెంబర్‌ సిరీస్‌ రోలోవర్స్‌ మూడు నెలల సగటుకు మించి నమోదయ్యాయి. ఈ అంశం ఆధారంగా సూచీలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆర్బీఐ సమావేశం, ఎన్నికల సమయం కావడం వల్ల ఒడిదుడుకులు అధికస్థాయిలోనే

సన్‌ఫార్మాకు సెబి షాక్‌

Monday 3rd December 2018

10శాతం పతమైన షేరు ధర గతంలో సెటిల్‌మెంట్‌ చేసుకున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును సెబీ తిరిగి చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో సన్‌ఫార్మా షేరు సోమవారం ట్రేడింగ్‌లో 10శాతానికి పైగా నష్టపోయింది. 2017లో సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఎండీ దిలీప్‌ సంఘ్వీతో పాటు 9 మంది ప్రమోటర్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తును రూ. 18 లక్షలు చెల్లించి సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. తాజాగా ఈ కేసును తిరిగి విచారించాలని సెబీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

Most from this category