STOCKS

News


బ్యాంకింగ్‌ కౌంటర్లలో భారీ అన్‌వైండింగ్‌

Tuesday 23rd April 2019
Markets_main1556017334.png-25297

హఠాత్తుగా క్రూడ్‌ ధర 6 నెలల గరిష్టస్థాయికి చేరడం, రూపాయి 69.5 దిగువకు దిగజారడంతో పాటు మరోవైపు వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 38 నెలల గరిష్టస్థాయికి పెరిగిన నేపథ్యంలో ట్రేడర్లు మార్కెట్లో బ్యాంకింగ్‌ కౌంటర్లలో లాంగ్‌ పొజిషన్లను పెద్ద ఎత్తున అన్‌వైండ్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ మరో రెండు రోజుల్లో ముగియనున్నందున, బ్యాంకింగ్‌ షేర్లలో బుల్‌ ఆఫ్‌లోడింగ్‌ కారణంగా వరుసగా మూడోరోజు బ్యాంక్‌ నిఫ్టీ క్షీణించింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ప్రధాన సూచీ నిఫ్టీకంటే అధికంగా క్షీణించిన బ్యాంక్‌ నిఫ్టీ 29,500 పాయింట్ల దిగువన ముగిసింది. నిఫ్టీ రికార్డు గరిష్టం 11,856 పాయింట్ల నుంచి మంగళవారం ముగింపు సమయానికి  2.3 శాతం వరకూ క్షీణించగా, బ్యాంక్‌ నిఫ్టీ 30,650 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి 30,450 పాయింట్ల కనిష్టస్థాయికి (దాదాపు 4 శాతం) పడిపోవడానికి ఆయా కౌంటర్లలో లాంగ్‌ పొజిషన్ల ఆఫ్‌లోడింగ్‌ కారణం. గత రెండు నెలలుగా నిఫ్టీ 10 శాతం వరకూ ర్యాలీ జరపగా, బ్యాంక్‌ నిఫ్టీ 15 శాతం పెరుగుదలతో అవుట్‌పెర్‌ఫార్మ్‌ చేసింది. బ్యాంకుల ఫలితాలు బావుంటాయన్న అంచనాలతో ఈ కౌంటర్లలో గత కొద్ది రోజుల నుంచి ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లు పెంచుకున్నారు. అయితే అనూహ్యంగా క్రూడ్‌ ధర, వీఐఎక్స్‌లు పెరగడం, రూపాయి క్షీణించడంతో పొజిషన్లను తాజాగా ఆఫ్‌లోడ్‌చేస్తున్నారు. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్లో సోమవారం ఓపెన్‌ ఇంట్రస్ట్‌ 13 శాతం, మంగళవారం 9 శాతం చొప్పున తగ్గింది. ఈ ఆఫ్‌లోడింగ్‌ ఎంత తీవ్రతరంగా వుందంటే....గత వారాంతంలో ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ, సోమవారం ఉదయం గరిష్టస్థాయి నుంచి 3.5 శాతం వరకూ ఈ షేరు పడిపోయింది. అలాగే ఎస్‌బీఐ 3 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 4 శాతం, యస్‌ బ్యాంక్‌ 9 శాతం చొప్పున క్షీణించాయి.



You may be interested

ధోని జోరు.. సీఎస్‌కే షేరు హుషారు..

Tuesday 23rd April 2019

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీకి, ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి చెప్పక్కర్లేదు. ఈ టీమ్‌ ప్రతి సీజన్‌లో టాప్‌ పొజిషన్లలోనే ఉంటుంది. ఐపీఎల్‌లో బాగా విజయవంతమైన ఫ్రాంచైజీగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను పేర్కొంటారు. ప్రస్తుత సీజన్‌లో కూడా సీఎస్‌కే బాగా రాణిస్తోంది. జట్టు సారధి ధోని నాయకత్వంలో సీఎస్‌కే కోట్ల మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇదంతా క్రికెట్‌ స్టేడియంలో సంగతి. అయితే ధోనీ కారణంగా సీఎస్‌కే ట్రేడింగ్‌

పొజిషన్లు తగ్గించుకోవడం మంచిది!

Tuesday 23rd April 2019

క్రూడ్‌; వీఐఎక్స్‌లో అనూహ్య పెరుగుదల అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర అనూహ్య పెరుగుదల, ఇండియా వీఐఎక్స్‌ మూడేళ్ల గరిష్ఠానికి చేరడంతో ఈక్విటీలపై అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండింటి ప్రభావంతో ట్రేడర్లు తమ పొజిషన్లు తగ్గించుకోవడంతో పాటు బుల్లిష్‌ బెట్స్‌ను వదులుకుంటున్నారు. ఎన్నికల ముందు వచ్చిన ఉత్సాహంతో సూచీల్లో లాంగ్‌ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా పెరిగింది. కానీ ఒక్కమారుగా మార్కెట్‌ను చుట్టుముట్టిన భయాలతో

Most from this category