STOCKS

News


యూనియన్‌ అభ్యర్థనతో కోల్‌ ఇండియా డౌన్‌

Monday 12th November 2018
Markets_main1542018525.png-21909

  • ఒకటిన్నర శాతం పతనమై రూ.264 వద్ద ముగింపు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో బిడ్లు దాఖలు చేయవద్దని ఆ రంగ యూనియన్లు ఉద్యోగులను కోరాయి. ప్రైవేటు రంగానికి సంస్థను అప్పజెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నందున ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఈమేరకు కట్టుబడి ఉండాలని కోరింది. నవంబర్‌ 15న ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రారంభంకానుండగా.. సంస్థ ఉద్యోగులకు 5 శాతం డిస్కౌంట్‌తో రూ.252.22 ధరకే 99,00,196 షేర్లను జారీ చేయాలని దేశీ అతి పెద్ద మైనింగ్‌ కంపెనీ కోల్‌ ఇండియా భావించిన సంగతి తెలిసిందే. తాజాగా 3.19 శాతం వాటాను విక్రయించిన ప్రభుత్వం నెమ్మదిగా సంస్థను ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తుందని, ఇందుకు తాము వ్యతిరేకంగా ఉన్నామని ఆల్ ఇండియా కోల్‌ వర్కర్స్ ఫెడరేషన్ జనరల్‌ సెక్రటరీ బీబీ రామనందన్ వ్యాఖ్యానించారు. ఈ అంశాల నేపథ్యంలో షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో ఒకటిన్నర శాతం పతనమై రూ.264 వద్ద ముగిసింది. ఈ షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.257, రూ.317లుగా ఉన్నాయి.



You may be interested

10500 దిగువకు నిఫ్టీ

Monday 12th November 2018

345 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు క్రమంగా పెరగడంతో మార్కెట్‌ వరుసగా రెండో సెషన్‌లోనూ భారీ నష్టంతో ముగిసింది. ప్రభుత్వరంగబ్యాంక్‌, అటో, మెటల్‌ షేర్లలో పతనంతో సెన్సెక్స్‌ 345 పాయింట్ల నష్టంతో 34,813 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 10,482 వద్ద ముగిశాయి. నేటి ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ..,  కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఫలితంగా

నేలచూపులు చూస్తోన్న ఏవియేషన్‌ షేర్లు

Monday 12th November 2018

ఏవియేషన్‌ షేర్లకు సోమవారం మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ముడిచమురు ఎగుతుల్లో అతిపెద్ద ఎగుమతిదారైన సౌది అరేబియా డిసెంబర్‌ నుంచి ముడిచమురు సరఫరాను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజులోనే ముడిచమురు ధరలు శాతానికి పైగా ర్యాలీ చేశాయి. చమురు ధరల పెరుగుదలతో రానున్న రోజుల్లో కంపెనీ మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో ఏవియేషన్‌ షేర్లు నేడు నేలచూపులు చూస్తున్నాయి. ఏవియేషన్‌ రంగంలో ప్రధాన షేర్లైన జెట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ఏవియేషన్‌ షేర్లు 4

Most from this category