STOCKS

News


అదరగొడుతున్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌

Thursday 25th April 2019
Markets_main1556178507.png-25345

మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ పెంపుతో గురువారం ఆల్ట్రాటెక్‌ షేర్లు అదరగొడుతున్నాయి. క్రితం రోజు కంపెనీ గతేడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.  స్టాండర్డ్‌లోన్‌ ప్రాతిపదికన రూ.1,017 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.446.14 కోట్లే కావడం గమనార్హం. మొత్తం అమ్మకాల ఆదాయం 18శాతం పెరిగి రూ.10,334 కోట్లను ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.8,750 కోట్లను సాధించింది. దేశీయంగా సైతం అమ్మకాలు 16శాతం పెరిగాయి. ఫలితాలు ప్రోత్సాహకర స్థాయిలో నమోదుకావడంతో రిలయన్స్‌ సెక్యూరిస్‌...  గతంలో తాము అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లపై కేటాయించిన ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’ రేటింగ్ పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను సైతం రూ.4,850కు పెంచుతున్నట్లు తెలిపింది. దాంతో నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 6.50శాతం ర్యాలీ చేసి రూ.4686.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇది షేరుకు ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు గతముగింపు ధర(రూ.4396.45)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.4655.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.3263.70 రూ.4686.30లుగా నమోదయ్యాయి. అలాగే మరో ప్రధాన సూచి నిఫ్టీ -50 సూచీలో టాప్‌ గెయినర్‌ ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం డౌన్‌

Thursday 25th April 2019

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో నెలకొన్న అమ్మకాలతో బ్యాంకు నిఫ్టీ గురువారం ట్రేడింగ్‌లో 1 శాతం(320 పాయింట్లు) నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 29,927.05ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లు లాభపడంతో ఇండెక్స్‌ 0.75శాతం(200 పాయింట్లు) జంప్‌చేసి 30057.70ల గరిష్టానికి చేరుకుంది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్‌లో మొదలైన అమ్మకాలతో ఇండెక్స్‌ ఆర్జించిన లాభాలన్నింటిని కోల్పోయి నష్టాల బాట

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త రికార్డు

Thursday 25th April 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు గురువారం కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.1392.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఒకానొక దశలో 1.50శాతం ర్యాలీ చేసి రూ.రూ.1411.50ల వద్ద స్థాయికి చేరుకున్నాయి. ఈ ధర షేర్ల కొత్త జీవితకాల గరిష్ట ధర కావడం విశేషం. ఉదయం 11:20ని.లకు షేరు బీఎస్‌ఈలో గత ముగింపు ధర(రూ.1390)తో

Most from this category