STOCKS

News


ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌కు ఫలితాల ఊపు

Thursday 24th January 2019
Markets_main1548315798.png-23781

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌రంగ కంపెనీ ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 7శాతం క్షీణించింది. క్యూ3 ఫలితాల్లో సాధించిన మెరుగైన ఫలితాలకు తోడు గ్లోబల్‌ రీసెర్చ్‌ దిగ్గజం మెక్వ్యరీ షేరు టార్గెట్‌ ధరను పెంచడం షేరు ర్యాలీకి దోహదపడింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ వెల్లడించిన ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు బీఎస్‌ఈలో గత ముగింపు (రూ.284.4) ధరతో పోలిస్తే 2శాతం లాభంతో రూ.284.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కంపెనీ మెరుగైన ఫలితాలను ప్రకటనతో మెక్వ్యరీ...షేరుకు గతంలో ప్రకటించిన ‘‘అవుట్‌ఫెర్మామింగ్‌’’ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే గతంలో తాము షేరుకు కేటాయించిన రూ.290ల టార్గెట్‌ ధరను సవరిస్తూ రూ.350లకు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో షేరుకు ఇంట్రాడేలో కొనుగోళ్ల బాట పట్టింది. ఒకానొక దశలో 7.50శాతం ర్యాలీ చేసి రూ.305.65ల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్న గం.12:30ని.లకు షేరు 6శాతం లాభంతో రూ.301ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.166.80 రూ.432.05లుగా నమోదయ్యాయి.
ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ క్యూ3 ఫలితాలు:-
ఈ క్యూ3లో కంపెనీ రూ.రూ.45.2 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో కంపెనీ ఆర్జించిన రూ.29.3 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 54.1శాతం అధికం. మొత్తం నికర వడ్డీ ఆదాయం సైతం 32.8శాతం పెరిగి రూ.287.7 కోట్లకు పెరిగింది. ఇదే కాలానికి నికర వడ్డీ మార్జిన్లు 11.8 శాతానికి పెరిగాయి. రుణ వితరణ వృద్ధి సాధించడంతో పాటు పెరిగిన మార్జిన్లు  మెరుగైన ఫలితాలకు కారణమయ్యాయని కంపెనీ ఎండీ, సీఈవో సమిత్‌ ఘోష్‌ తెలిపారు.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Thursday 24th January 2019

దాదాపు 3వేల కోట్ల రూపాయల ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ లోన్‌ కేసులో అవకతవకలకు సంబంధించి గురువారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను రిజిస్టర్‌ చేసింది. దీంతోపాటు పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈలోనుకు సంబంధించి ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తన పదవిని వదులుకున్నారు. చందాకొచ్చర్‌ భర్తకు సంబంధించిన నుపవర్‌ రెనీవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వీడియోకాన్‌ గ్రూప్‌ నుంచి అక్రమంగా నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇండియాపై బుల్లిష్‌

Thursday 24th January 2019

ఆనంద్‌ మహీంద్రా ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్లు భారత్‌ బుల్లిష్‌ పిరియడ్‌లో ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇండియా ప్రస్తుత స్థితికి రావడానికి అనేక అవరోధాలను అధిగమించాల్సివచ్చిందని, అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయాల్సివచ్చిందని చెప్పారు.  గతకొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలు ఫలాలను అందిస్తున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలాలను దేశం వినియోగించుకొని దూసుకుపోవాలన్నారు. గతేడాది పండుగ సీజర్‌ అనుకున్నంత జోరుగా లేదని, కానీ రాబోయే నెలల్లో వినియోగం భారీగా పెరుగుతుందని అంచనా

Most from this category