STOCKS

News


ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ 10 శాతం అప్‌

Thursday 15th November 2018
Markets_main1542278699.png-22055

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేరు గురువారం ఇంట్రాడేలో 10 శాతం మేర లాభాలను నమోదుచేసింది. ఉదయం సెషన్లో 9.6 శాతం లాభపడి రూ.238.6 వద్దకు చేరుకుంది. మార్కెట్‌ ముగింపు సమయానికి ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం లాభపడి రూ.234.90 వద్ద ముగిసింది. క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.44.3 కోట్లుకు చేరుకుందని బుధవారం మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిసిన తరువాత బోర్డ్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.12 కోట్ల నష్టాన్ని నమోదుచేసిన విషయం తెలిపిందే. మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 23.6 శాతం పెరిగి రూ.467.4 వద్దకు చేరుకున్నాయి. ఫలితాల అనంతరం ఈరోజు మార్కెట్‌లో షేరు ధర ర్యాలీచేసింది. ఈ షేరు 52 వారాల కనిష్టస్థాయి రూ.166, గరిష్టస్థాయి రూ.434 వద్ద ఉన్నాయి. You may be interested

కొత్త ఏడాది నుంచి ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు’ 

Thursday 15th November 2018

క్యాపిటల్‌ ఫస్ట్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకుల విలీనానంతరం ఏర్పడే ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు’ వచ్చే జనవరి నుంచి కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. అన్ని కీలక అనుమతులు వచ్చేశాయని, ఒక్క ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కోసం చూస్తున్నామని, నెలలోపు అది కూడా రావచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద పేరు మార్పునకు దరఖాస్తు చేయనున్నట్టు పేర్కొన్నాయి. విలీనం తర్వాత కొత్త బ్యాంకు కార్యకలాపాలు జనవరి నుంచి ఆరంభం

నవంబర్‌లో బేర్స్‌దే పైచేయి..!

Thursday 15th November 2018

ముంబై: అక్టోబరులో 5 శాతం పతనాన్ని నమోదుచేసిన సెన్సెక్స్‌ ఆ తరువాత కాస్త కోలుకుని నవంబర్‌లో ఇప్పటివరకు 2 శాతం లాభాలను పొందింది. ఈ మేరకు రిలీఫ్‌ వచ్చినప్పటికీ, గతంలో నవంబర్‌ నెలల్లో చోటుచేసుకున్న పరిణామాలను చూసి ఇన్వెస్టర్లు జంకుతున్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో ఏకంగా 7 సార్లు మార్కెట్‌ బేర్స్‌ పట్టులోనే కొనసాగింది. ఈ నెలలో సెన్సెక్స్‌ 1-12 శాతం మేర నష్టాలను

Most from this category