STOCKS

News


ఇండియా మార్కెట్ల డీరేటింగ్‌!

Wednesday 26th September 2018
news_main1537948772.png-20594

యూబీఎస్‌ అంచనా
అంతర్జాతీయ మార్కెట్లు బలంగా ఉన్నా దేశీయ మార్కెట్లలో భారీ పతనం సంభవిస్తోంది. సూచీల్లో అస్థిరతకు ఈ పతనం సంకేతమని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అభిప్రాయపడుతోంది. ఈ పతనానికి తాత్కాలిక లిక్విడిటీ ఇబ్బందులు కారణమా? లేక కొత్తగా బయటపడిన క్రెడిట్‌ సంక్షోభం తాలుకా స్పందనా? అనేది తెలియాల్సిఉందని పేర్కొంది. సూచీల్లో అధిక వాల్యూషన్లకు నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తోడవడం ఆందోళనకరమని తెలిపింది. అందువల్ల ఇప్పటికైతే తగ్గినప్పుడు కొను సూత్రాన్ని పాటించలేమని తెలిపింది. మార్కెట్లు ప్రస్తుతం డీరేటింగ్‌కు అనువుగా ఉన్నాయని అభిప్రాయపడింది. నిఫ్టీ పీఈ అంచనాలు 7- 8 శాతం మేర తగ్గవచ్చని అంచనా వేసింది.  వచ్చే డిసెంబర్‌కు నిఫ్టీ 10500 పాయింట్లకు దిగిరావచ్చని పేర్కొంది. బుల్స్‌ చెలరేగితే 11900 పాయింట్లకు, బేర్స్‌ పట్టు బిగిస్తే 8800 పాయింట్లకు నిఫ్టీ వస్తుందని అంచనా వేసింది. మార్కెట్లలోకి రిటైల్‌ నిధుల ప్రవాహం సన్నగిల్లుతోందని, ఇది ఆందోళనకరమైన అంశమని తెలిపింది. తాజా పతనం అనంతరం కూడా దేశీయ మార్కెట్లు ఆకర్షణీయంగా మారలేదని, రిస్క్‌రివార్డు నిష్పత్తి అంతంతమాత్రంగా ఉందని తెలిపింది. ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ స్టాకులపై ఓవర్‌ వెయిట్‌గా ఉన్నామని వెల్లడించింది. ఎన్‌పీఎఫ్‌సీలపై పాజిటివ్‌గా లేమని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో తలెత్తుతున్న సంక్షోభం స్థూల ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుందని వెల్లడించింది. ముఖ్యంగా వినిమయంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. దేశీయ గృహ వినిమయం ఇటీవల కాలంలో పెరిగింది. మరోవైపు పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ గరిష్ఠాలకు చేరడం సైతం ఈక్విటీల్లో బలహీనతను సూచిస్తోందని యూబీఎస్‌ తెలిపింది. 



You may be interested

ఈ ఐపీఓలకు ఏమైంది..?

Wednesday 26th September 2018

ప్రైమరీ మార్కెట్‌లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సెకండరీ మార్కెట్‌కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి. ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్‌ వాల్యుయేషన్స్‌ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను

బీఈఎల్‌ 11 శాతం అప్‌

Wednesday 26th September 2018

ముంబై:- వచ్చే మూడేళ్లలో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని యాజమాన్యం చేసిన ప్రకటనతో ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బీఈఎల్‌) షేరు బుధవారం భారీగా లాభపడింది. వచ్చే మూడేళ్లలో కంపెనీ ఆదాయం 12-15శాతం వృద్ధిని, ఈబిటా మార్జిన్‌ వృద్ధి 17-19శాతం మధ్య నమోదు చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.18-20వేల కోట్ల ఆర్డర్లను దక్కించుకుందని ప్రకటించింది. అలాగే పెరిగిన కొత్త ధరల విధానం కంపెనీ మార్జిన్లపై ఎలాంటి ప్రభావాన్ని

Most from this category