యూబీఎస్ ఎలక్షన్ పిక్స్
By D Sayee Pramodh

దేశీయ ఈక్విటీలు ఈ సంవత్సరం 7 శాతం వరకు పతనం చవిచూడవచ్చని ప్రముఖ బ్రోకింగ్ దిగ్గజం యూబీఎస్ అంచనా వేసింది. సాధారణ ఎన్నికల వేళ ఏర్పడే రాజకీయ అనిశ్చితి మార్కెట్‌ను కుంగదీస్తుందని తెలిపింది. నిఫ్టీ ఏడాది చివరకు పదివేల పాయింట్లను చేరవచ్చని అభిప్రాయపడింది. జీడీపీలో మాత్రం వృద్ధి ఉంటుందని 2019 అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఎన్నికల వేళ పాపులర్ విధానాలు, వాటి ఫలితాలు, వివిధ ప్రభుత్వాలు వాటి ఆధారిత సంస్కరణలు వంటి అనేక అంశాలను అంచనా వేసి యూబీఎస్ ఈ నివేదికను రూపొందించింది. ఏడాది ప్రధమార్ధాన్ని రాజకీయాలు శాసిస్తాయని యూబీఎస్ ఇండియా రిసెర్చ్ హెడ్ గౌతమ్ చెప్పారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రుణమాఫీలు, రైతులకు నేరుగా నిధులు అందిచాలనే కేంద్రం యోచన కలిసి ప్రభుత్వంపై ఎంతో ఒత్తిడి పెంచుతాయన్నారు. వృద్ధికి కీలకమైన మానిటరీ విధానాలు, క్యాపెక్స్‌లో రికవరీ, ఎగుమతుల్లో వృద్ధి ఇప్పటికీ పుంజుకోలేదని తెలిపారు.
ఎన్నికల వేళ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన స్టాకులను పరిశీలించాలని యూబీఎస్ సూచించింది.
ఎన్నికల సమయంలో కొనుగోళ్లకు ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, మారుతీ సుజుకీ షేర్లను రికమండ్ చేసింది. ఎవెన్యూ సూపర్ మార్కెట్, అశోక్‌లేలాండ్, ఐషర్ మోటర్స్, భెల్ షేర్లపై నెగిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది. మిడ్‌క్యాప్స్‌లో డా. లాల్‌పాత్ ల్యాబ్స్, ఇండియన్ హోటల్స్, ఈక్విటాస్ షేర్లు బాగున్నట్లు తెలిపింది.
You may be interested
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
Wednesday 16th January 2019అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో బుధవారం భారత మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. యూరోప్‌లో బ్రెగ్జిట్ ఆందోళనతో పాటు ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ఐరోపా మార్కెట్ల మిశ్రమ ప్రారంభం దేశీయ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు అక్కడక్కడే ముగిశాయి. నిఫ్టీ 3.50 పాయింట్లు లాభపడి 10890.30 వద్ద, సెన్సెక్స్ 2.96 పాయింట్ల లాభపడి 36321.29 ముగిసింది. హెచ్డీఎఫ్ఎఫ్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్,
చిన్న స్టాకులతోనే సంపద సృష్టి!
Wednesday 16th January 2019మోతీలాల్ ఓస్వాల్ ఈ ఏడాది హవా వర్ధమాన మార్కెట్లదేనని మోతీలాల్ ఓస్వాల్ ప్రతినిధి మనీశ్ సొంథాలియా చెప్పారు. దేశీయ మార్కెట్లో స్మాల్, మిడ్‌క్యాప్స్‌తో మంచి లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్ మంటలు కాస్త చల్లబడడం, యూఎస్ ఫెడ్ స్వరం మృదువుగా మారడం, ఈసీబీ నుంచి కొత్త ఉపసంహరణలు లేకపోవడం వంటి పరిణామాలు, దేశీయంగా ద్రవ్యోల్బణం దిగిరావడం, ఆర్బీఐ రేట్‌కట్‌కు అవకాశాలు పెరగడం వంటి పరిణామాలు భారత మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం