STOCKS

News


మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు..

Thursday 13th September 2018
Markets_main1536812202.png-20213

అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌లు కనిష్ట స్థాయిల నుంచి పుంజుకొని లాభాల్లోకి వచ్చాయి. అయితే నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే ఉండిపోయింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 28 పాయిం‍ట్ల లాభంతో 25,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,889 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 7,954 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించిన కూడా మార్కెట్లు సానుకూలముగా స్పందించలేదు. యాపిల్‌ షేరు 1.24 శాతం పడిపోయింది. 



You may be interested

కొత్త ఐఫోన్‌ టెన్‌ఎస్‌ వచ్చేసింది ..

Thursday 13th September 2018

క్యుపర్టినో, కాలిఫోర్నియా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌.. ఐఫోన్‌ టెన్‌ఎస్‌ ఫోన్లను  ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్‌ టెన్‌ఎస్‌ మ్యాక్స్‌) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఇవి లభిస్తాయి.  512 జీబీ దాకా మెమరీ ఉంటుంది.   వీటితో పాటు వాచ్‌లకు సంబంధించి సిరీస్‌ 4ను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది. పాత వాటితో

ఆసియా మార్కెట్లు లాభాల్లో..

Thursday 13th September 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 196 పాయింట్ల లాభంతో 22,800 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,287 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 374 పాయింట్ల లాభంతో 26,719 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 2 పాయింటు లాభంతో 3,126 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై

Most from this category