STOCKS

News


యూఎస్‌ మార్కెట్‌ సద్దుమణగాలి!

Friday 4th January 2019
Markets_main1546596758.png-23414

యూఎస్‌ మార్కెట్లలో అలజడి సద్దు మణిగితేనే ఈ ఏడాది భారత్‌తో పాటు ఇతర వర్దమాన దేశాల మార్కెట్లు మంచి ప్రదర్శన చూపుతాయని హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. అయితే స్వల్పకాలానికి యూఎస్‌ మార్కెట్లో అలజడులుల తగ్గకపోవచ్చని, తీవ్రమైన కదలికలు నమోదవుతాయని అంచనా వేశారు. యూఎస్‌ మార్కెట్లు 5- 10 శాతం పడిపోయినా భారత మార్కెట్లు మంచిగానే ఉంటాయని, కానీ పాజిటివ్‌ రాబడులు పెద్దగా ఉండవని విశ్లేషించారు. గత నెల్లో దాదాపు 11 సెషన్లు యఎస్‌ మార్కెట్లు దాదాపు ఒక శాతాన్ని మించిన కదలికలు చూపాయి.

దేశీయంగా ప్రైవేట్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నట్లు అరోరా చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ప్రైవేట్‌ రంగం నెంబర్‌వన్‌ థీమ్‌గా నిలుస్తోందన్నారు. తమ కంపెనీ రెండు పెద్ద ప్రైవేట్‌ బ్యాంకు షేర్లలో పొజిషన్లు తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగవుతోందన్నారు. వాటి వాల్యూషన్లు కూడా దిగివచ్చాయని చెప్పారు. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీలపై నెగిటివ్‌గానే ఉన్నామన్నారు. తమ పోర్టుఫోలియోలో ఎన్‌బీఎఫసీల వాటాను 15 నుంచి 7 శాతానికి తగ్గించుకున్నామన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభానంతరం ఈ రంగంపై వెయిటేజ్‌ తగ్గించుకున్నట్లు చెప్పారు. ఈ రంగ సమీప భవిష్యత్‌పై ఇప్పుడే ఏమీ ఊహించలేమని, ఈ రంగాన్ని మార్కెట్లు ఎలా చూస్తాయో చెప్పలేమని అన్నారు. ఈ రంగం కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని అరోరా అంచనా వేశారు. 



You may be interested

రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌

Friday 4th January 2019

10700 పైకి నిఫ్టీ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ రెండు రోజుల భారీ నష్టాలకు ముగింపు పలుకుతూ శుక్రవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ తిరిగి 10700 స్థాయిని అందుకోగా, సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభాల్ని కూడగట్టుకుంది. తగ్గిన ముడిచమురు ధరలు, రూపాయి డాలర్‌ మారకంలో బలపడటం, ఆసియాలో పలు మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ తదితర సానుకూలాంశాలతో నేడు మార్కెట్‌ దేశీయ మార్కెట్‌ లాభాలతో

ఫార్మా ఫలితాలపై క్రెడిట్‌ సూసీ అంచనాలు

Friday 4th January 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అరబిందో ఫార్మా, టొరెంట్‌ ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు బలమైన ఫలితాలు నమోదు చేస్తాయని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ అంచనా వేసింది. ఇదే సమయంలో సిప్లా, డా.రెడ్డీస్‌ పేలవ ఫలితాలు చూపుతాయని అభిప్రాయపడింది. సన్‌ఫార్మా ఫలితాలు ఇలుమ్యా మందు కారణంగా బాగానే ఉండొచ్చని కానీ ఎబిటా మాత్రం దెబ్బతింటుందని, అధిక ప్రమోషన్‌ వ్యయాలే ఇందుకు కారణమని వివరించింది. డా.రెడ్డీస్‌ ఫలితాల్లో

Most from this category