STOCKS

News


పసిడి 12డాలర్ల ర్యాలీ

Tuesday 13th August 2019
Markets_main1565675918.png-27730

ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ధర 12డాలర్ల మేరకు ర్యాలీ చేసింది. హాంగ్‌కాంగ్‌ నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలతో అర్జెంటీనా కరెన్సీ క్షీణత పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల లాభంతో 1,527 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హాంగ్‌కాంగ్‌లోని ప్రధాన భూభాగం చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఉధృతి దాల్చాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానశ్రయంగా పేరొందిన హాంగ్‌కాంగ్‌లో కార్గో ఎయిర్‌పోర్ట్‌ మూసివేయబడింది. మరోవైపు అక్టోబర్‌ 27న జరగనున్న అర్జెంటీనా ప్రైమరీస్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు మాక్రికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్‌ ఫ్రెండ్లీగా పేరోందిన మాక్రి ఓటమితో అక్కడి కరెన్సీ ఇతర దేశ కరెన్సీ విలువలతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఈ అనిశ్చితి పరిస్థితులకు తోడు అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు తగ్గముఖం పట్టకపోవడం ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ధరలు 1500డాలర్లపై ట్రేడయ్యేందుకు అనుగుణంగా ఉన్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగా రూ.235లు ర్యాలీ:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ పసిడి ఫ్యూచర్లు ర్యాలీ కొనసాగుతుంది. ప్రపంచమార్కెట్లో పసిడి ధరల ర్యాలీ, నేడు దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత, ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ తదితర అంశాలు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు డిమాండ్‌ పెంచుతున్నాయి. ఫలితంగా నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంట్రాక్టు 10గ్రామల పసిడి ధర రూ.234.00లు పెరిగి రూ.38475.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మరింతగా పెరిగిన జీవీకే పవర్‌ నష్టాలు

Tuesday 13th August 2019

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రెట్టింపునకు మించి పెరిగాయి.  గత క్యూ1లో రూ.55 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.132 కోట్లకు పెరిగాయని జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,106 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు తగ్గిందని పేర్కొంది. జీవీకే కంపెనీ.. ఇంధన, విమానాశ్రయాలు, రవాణా, ఆతిధ్య, జీవ శాస్త్రాల

నష్టాల్లో బ్యాంకింగ్‌ షేర్లు..

Tuesday 13th August 2019

మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా మొదలై ఉదయ 10.15 సమయానికి నష్టాల్లోకి ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ 330.60 పాయింట్లు కోల్పోయి, 28112.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.83 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.80 శాతం లాభపడి ట్రేడవుతుండగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మాత్రం 0.50 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. కాగా ప్రవేట్‌ రంగ

Most from this category