News


ఈనెలలో 2 ఐపీఓలు

Monday 17th September 2018
Markets_main1537159260.png-20309

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈనెల 17న (సోమవారం) ప్రారంభమై 19న ముగియనుంది. రైల్వే ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాల కల్పనలో నిమగ్నమైన ఈ సంస్థ రూ.10 ముఖవిలువ కలిగిన 99.05 లక్షల ఈక్విటీ షేర్లు (ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటా) జారీ చేయనుంది. రూ.470-475 శ్రేణిలో ప్రైస్‌బ్యాండ్‌ ప్రకటించింది. హయ్యర్‌ ప్రైస్‌బ్యాండ్‌ వద్ద రూ.470 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా కంపెనీ ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న మరో ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ సెప్టెంబరు 24న ప్రారంభమై 26తో ముగియనుంది. ఈ కంపెనీ ఐపీఓ ధరల శ్రేణి రూ.115-118గా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.345 కోట్లను కంపెనీ సమీకరించనుంది. ఇరు సంస్థలలో కలిపి ఈనెలలో రూ.815 కోట్ల సమీకరణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.



You may be interested

చైనాపై సుంకాలవైపే ట్రంప్ మొగ్గు!!

Monday 17th September 2018

వాషింగ్టన్‌: చైనాతో ప్రతిపాదిత చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఆ దేశం నుంచి మరిన్ని దిగుమతులపై సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నారు.  దాదాపు 200 బిలియన్ డాలర్ల దిగుమతులపై కొత్తగా టారిఫ్‌లను అమలు చేసే విషయంలో ట్రంప్ ముందుకే వెళ్లనున్నట్లు ది వాల్‌ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ టారీఫ్‌ల అమలు సోమవారం నుంచే ప్రారంభంకావొచ్చని

ఇది లాభాల స్వీకరణ సమయం: క్రెడిట్‌ సూసీ

Monday 17th September 2018

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లు ఫండమెంటల్స్‌కు మించి ర్యాలీ చేశాయని, విలువలు అధిక స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయాల్సిన తరుణమని క్రెడిట్‌సూసీ నివేదిక తెలియజేసింది. పొదుపు నిధులు తరలి రావడం, జీఎస్టీ తర్వాత కార్పొరేట్‌ ఆదాయ అంచనాలు మెరుగుపడడం, అమెరికాతో వాణిజ్య యుద్ధం విషయంలో భారత్‌ నిలకడగా ఉండడం వంటి అంశాల తోడ్పాటుతో భారత ఈక్విటీల విలువలు అధిక స్థాయికి చేరాయని వివరించింది. ‘‘కార్పొరేట్‌ ఆదాయలు మరింత

Most from this category