STOCKS

News


ప్రతి 5 కంపెనీలలో 2 క్రియారహితం..

Wednesday 28th November 2018
Markets_main1543402418.png-22458

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)లో నమోదైన కంపెనీలలో ఏకంగా 6.94 లక్షల సంస్థలు ఇన్‌యాక్టీవ్‌ (క్రియారహితం)గా ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది అక్టోబరు 31నాటికి దేశంలో 18.10 లక్షల కంపెనీలు ఆర్‌ఓసీలో నమోదు కాగా.. వీటిలో కేవలం 11.16 లక్షల కంపెనీలు మాత్రమే సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ సమాచారం ద్వారా వెల్లడైంది. అంటే ప్రతి 5 కంపెనీలలో 3 మాత్రమే వ్యాపారం కొనసాగిస్తుండగా.. 2 కంపెనీలు క్రియారహితం ఉన్నట్లు లెక్క తేలింది. ఇన్‌యాక్టీవ్‌ కంపెనీల జాబితాలో 10,574 మూతపడగా, 6,208 లిక్విడేషన్‌లో ఉన్నాయి. మరి కొన్ని కంపెనీల పేర్లు అధికారిక రికార్డుల నుండి తొలగించడం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కంపెనీలు ఏకంగా 6 లక్షలు ఉన్నాయి. అయితే, వీటిలో 4,794 కంపెనీలు ఎల్‌ఎల్‌పీగా మారిడం వల్ల వీటి పేర్లను మునుపటి రికార్డ్స్‌ నుంచి తొలగించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. 



You may be interested

ఈ కంపెనీల ఆదాయాల్లో నిలకడైన వృద్ధి

Thursday 29th November 2018

ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, గత నాలుగు క్వార్టర్లుగా ఆదాయాల్లో వృద్ధిని నమోదు చేస్తున్న ఈ కంపెనీలపై ఓ సారి దృష్టి సారించొచ్చు. ఆశ్చర్యకరంగా పనితీరును మెరుగుపరుచుకుంటున్న ఈ 12 కంపెనీల్లో కొన్ని ఇప్పటికే మంచి రాబడులను పంచాయి. ప్రతీ త్రైమాసికంలోనూ ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నవి, 20 శాతానికి పైగా లాభాల మార్జిన్‌ను కలిగి ఉన్నవి, రూ.500 కోట్లకు పైగా మార్క్‌ట్‌ విలువ కలిగిన కంపెలు ఇవి. వీటిలో టీసీఎస్‌,

ఎన్‌సీడీల జారీకి సిద్ధమైన పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌

Wednesday 28th November 2018

ముంబై: నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ)ను జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో ఈ మొత్తాన్ని సమీకరించేందుకు బోర్డులోని పరిపాలనా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిపింది. తొలుత రూ.400 కోట్లను, ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయిన పక్షంలో మరో రూ.100 కోట్లను కలిపి మొత్తంగా రూ.500 కోట్ల ఇష్యూ సైజ్‌కు బోర్డు నిర్ణయించిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌ ద్వారా వెల్లడించింది. ఈ

Most from this category