STOCKS

News


ఫలితాల జోష్‌.... టీవీఎస్‌ మోటర్‌ ర్యాలీ

Tuesday 22nd January 2019
Markets_main1548147331.png-23731

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించంతో టీవీఎస్‌ మోటర్ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో టీవీఎస్‌ షేరు రూ.535.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు కంపెనీ ప్రకటించిన లాభదాయక క్యూ3 ఫలితాలతో షేరు డిమాండ్‌కు పెరిగింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 4శాతం ర్యాలీ చేసి రూ.559.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గత ముగింపు ధర(రూ.538.05) పోలిస్తే దాదాపు 3శాతం లాభంతో రూ.555ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 478.70 రూ.734.00లుగా నమోదయ్యాయి.
టీవీఎస్‌ మోటర్ మూడో త్రైమాసిక ఫలితాలు:-
అమ్మకాలు, ఎగుమతుల అండతో టీవీఎస్‌ మోటర్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ3లో మొత్తం రూ.178.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4566 కోట్లను సాధించింది. గతేడాది ఇదే క్యూ3తో పోలిస్తే నిర్వహణ లాభం(ఇబిటా) 25శాతం వృద్ధి చెంది 375.7 కోట్లను సాధించగా, ఇక ఇబిటా మార్జిన్లు 7.7శాతం పెరిగి 8.1 శాతంగా నమోదయ్యాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో 19శాతం వృద్ధిని సాధించి 9.50 లక్షల వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే క్యూ3లో 8.26 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది. మోటర్‌ సైకిళ్ల విక్రయాలు కూడా 20.3శాతం పెరిగి 3.14 లక్షల నుంచి 3.78 లక్షల యూనిట్లకు చేరాయి. ఇక మొత్తం 3.54 లక్షల స్కూటర్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 2.69 లక్షలతో పోలిస్తే స్కూటర్ల అమ్మకాలు 31.7 శాతానికి పెరిగాయి. దేశీయంగా మొత్తం వాహన అ‍మ్మకాల్లో 10.5శాతం వృద్ధిని సాధించి 6.85లక్షల అ‍మ్మకాలను జరిపింది. ఎగుమతులు 25.8 వృద్ధితో 1.40 లక్షల వాహనాల నుంచి 1.77లక్షల వాహనాలకు చేరాయి.



You may be interested

బ్రోకరేజ్‌ల లాంగ్‌టర్మ్‌ రికమండేషన్లు

Tuesday 22nd January 2019

1. జస్ట్‌డయిల్‌: నోమురా నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 765. ఎస్‌ఎంఈ అడ్వర్టైజింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత వ్యయనియంత్రిత కంపెనీ. క్యు3లో మంచి ఫలితాలు చూపింది. ఈ రంగంలో పోటీ ఉన్నా, టైర్‌2, 3 నగరాలకు విస్తరించడం ద్వారా పోటీని తట్టుకుంటోంది. 2. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: సీఎల్‌ఎస్‌ఏ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. ఎర్నింగ్స్‌లో 21 శాతం చక్రీయవార్షిక వృద్ధి ఉంటుంది. ఎన్‌ఐఐలో 23 శాతం పెరుగుదల అత్యంత

ఈ షేర్లన్నీ బేరిష్‌

Tuesday 22nd January 2019

ఎంఏసీడీ నెగిటివ్‌ క్రాసోవర్‌ ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.

Most from this category