News


టీటీకే హెల్త్‌కేర్‌ 20శాతం జంప్‌

Thursday 24th January 2019
Markets_main1548320850.png-23783

ప్రముఖ వైద్య సేవల కంపెనీ టీటీకే హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం 20శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.770.3ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తెలియని కారణాలతో ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఏకంగా 20శాతం ర్యాలీ చేసి రూ.924.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.770.3)తో పోలిస్తే దాదాపు 19శాతం లాభంతో రూ.921ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  బీఎస్‌ఈలో ఇండెక్స్‌లో ‘‘బి’’ గ్రూప్‌లో అగ్రస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. అలాగే ఇదే సమయానికి ఈ గ్రూప్‌లోని షేర్లు స్పైస్‌ మొబిలిటీ లిమిటెడ్‌, నితిష్‌ ఎస్టేట్స్‌, ఆమ్‌కే హౌసింగ్‌ ఫైనాన్స్‌ణ లిమిటెడ్‌, ఇండియా - స్విఫ్ట్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ షేర్లు 10శాతం నుంచి 15శాతం లాభంతో టాప్‌ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. ఇక టీటీకే హెల్త్‌కేర్ సర్వీసెస్ ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 705.05 రూ.1457.65లుగా నమోదయ్యాయి.  టీటీకే హెల్త్‌కేర్‌ చిన్న పిల్లల వ్యక్తిగత సంరక్షణలైన వుడ్‌వర్డ్స్‌, గుడ్‌హోమ్‌లైఫ్‌, ఈవా, ఫెమ్‌ లాంటి ఔషధాలను  మార్కెట్లోకి విడుదల చేస్తుంది. 



You may be interested

ఈ స్టాకులపై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Thursday 24th January 2019

ఏసియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మైండ్‌ట్రీ, ఐటీసీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ బ్రోకింగ్‌ సంస్థ ప్రతినిధి సంజీవ్‌ బాసిన్‌ చెప్పారు. ఏసియన్‌ పెయింట్స్‌ డెకరేటివ్‌ పెయింటింగ్‌ వ్యాపారంలో మెజార్టీ వాటా పెంచుకుంటూపోతోందన్నారు. రూ. 1150 నుంచి ఈ షేరుపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఇటీవల పెంచిన ఉత్పత్తుల ధర ‍ప్రభావం వచ్చే మూడునెలల్లో ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. మైండ్‌ట్రీపై రూ.800 స్థాయి నుంచి బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఈ కంపెనీలో వాటాలను

ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Thursday 24th January 2019

దాదాపు 3వేల కోట్ల రూపాయల ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ లోన్‌ కేసులో అవకతవకలకు సంబంధించి గురువారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను రిజిస్టర్‌ చేసింది. దీంతోపాటు పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈలోనుకు సంబంధించి ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తన పదవిని వదులుకున్నారు. చందాకొచ్చర్‌ భర్తకు సంబంధించిన నుపవర్‌ రెనీవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వీడియోకాన్‌ గ్రూప్‌ నుంచి అక్రమంగా నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Most from this category