STOCKS

News


ట్రంప్‌ హెచ్చరికలు... మార్కెట్‌కు ఆందోళన కలిగించేవేనా?

Thursday 7th March 2019
Markets_main1551983005.png-24479

భారత్‌కు వాణిజ్య ప్రాధాన్యం హోదా (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ)ను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఆరంభంలో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినా ఆ తర్వాత లాభాల్లోనే ప్రయాణించాయి. జీఎస్‌పీ కార్యక్రమం 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులకు వర్తిస్తోంది. వీటిపై అమెరికాలో సుంకాలు ఉండవు. ఇప్పటికే ఎగుమతుల వృద్ధి నిదానంగా ఉన్న భారత్‌కు జీఎస్‌పీని రద్దు చేయడం రూపాయిపై ప్రభావం చూపించనుందని అంచనా.

 

అమెరికాతో వాణిజ్య యుద్ధం ఫలితంగా చైనా ఆర్థిక వృద్ధి ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత సంవత్సరానికి జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని 6-6.5 శాతానికి ఆ దేశం తగ్గించుకుంది కూడా. ఇక మనదేశ జీడీపీ ఐదు త్రైమాసికాల కనిష్ట స్థాయి 6.6 శాతానికి అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో తగ్గిపోయింది. సాగు, తయారీ వృద్ధి తగ్గుదల, బలహీన వినియోగ డిమాండ్‌ ఇందుకు కారణాలుగా ప్రభుత్వ డేటా స్పష్టం చేస్తోంది. ట్రంప్‌ హెచ్చరికలు భారత్‌కు సానుకూలం కాదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఒక దేశం తర్వాత మరో దేశానికి వారు వెళుతున్నట్టు కనిపిస్తోంది. చైనాతో మొదలైంది. ఆ తర్వాత లక్ష్యం భారత్‌, టర్కీయే’’ అని ఏఎన్‌జెడ్‌ దక్షిణాసియా, భాతర చీఫ్‌ ఎకనమిస్ట్‌ సంజయ్‌ మాథుర్‌ తెలిపారు. భారత్‌ తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు వేస్తోందని ఎన్నో సందర్భాల్లో ట్రంప్‌ విమర్శించిన విషయం తెలిసిందే. భారత టారిఫ్‌లకు ప్రతీకారంగా కాకుండా, ప్రతిస్పందనగా తాను సైతం టారిఫ్‌లు పెంచాలనుకుంటున్నట్టు తాజాగా ట్రంప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఇతర దేశాలతో వ్యవహరించినట్టే భారత్‌తోనూ నడుచుకోవాలని ట్రంప్‌ అనుకుంటున్నారు. కనుక ఓ వాణిజ్య ఒప్పందం దిశగా కృషి చేయవచ్చు’’ అని స్పార్టన్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ చీఫ్‌ మార్కెట్‌ ఎకనమిస్ట్‌ పీటర్‌ కార్డిల్లో పేర్కొన్నారు.

 

కొన్ని రంగాల్లో అమెరికాకు భారత్‌ నుంచి ఎగుమతులు గణనీయంగా ఉంటున్నాయని, ముఖ్యంగా జెమ్స్‌, జ్యుయలరీ రంగంపై ప్రభావం ఉంటుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి తెలిపారు. స్టీల్‌ మరో రంగమని, ఎంత మేర ప్రభావం ఉంటుందన్న దాన్ని వేచి చూడాల్సి ఉందన్నారు. అయితే, ప్రత్యేకంగా ఓ రంగంపై భారీ ప్రభావం ఉంటుందని ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. వాణిజ్య ప్రాధాన్య హోదా కింద భారత్‌ 2,000 ఉత్పత్తులపై అమెరికాలో సున్నా పన్నుల భారాన్ని ఎదుర్కొంటుంటే... అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌కు వచ్చే ఉత్పత్తులు కొన్నింటిపై భారీగా సుంకాలు ఉన్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇదే ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంటున్నారు. అయితే, ప్రాధాన్య వాణిజ్య చికిత్స కింద భారత్‌కు కలిగే లబ్ధి 190 మిలియన్‌ డాలర్లుగానే ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాద్వాన్‌ పేర్కొన్న విషయం గమనార్హం.You may be interested

11050 దిగువన నిఫ్టీ ప్రారంభం

Friday 8th March 2019

ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 36680 వద్ద, నిప్టీ 22 పాయింట్లను కోల్పోయి 11035 వద్ద ప్రారంభమైంది. ఆంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రపంచమార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌ నెలకొంది. నెమ్మదించిన ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడంతో పాటు తక్కువ వడ్డీలకు

రుణాల్లో పురుషులను అధిగమిస్తున్న మహిళలు!

Thursday 7th March 2019

రుణాలు తీసుకునే విషయంలో మహిళలు మరింత మంది ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనమే 2015 నుంచి 2018 మధ్య కాలంలో మహిళా రుణ గ్రహీతల సంఖ్య 48 శాతం పెరగడం. రుణాలు తీసుకునే వారిలో పురుషులే అధికంగా ఉంటున్నప్పటికీ... 2015-18 మధ్య కాలంలో రుణాలు తీసుకునే వారి వృద్ధి 35 శాతానికే పరిమితమైనట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ డేటా ఇన్‌సైట్స్‌ నివేదిక తెలియజేసింది. ఏటా 86 లక్షల నూతన మహిళా ఖాతాలు

Most from this category