STOCKS

News


దేశీ ఫార్మాపై ట్రంప్‌ హెల్త్‌కేర్‌ ప్రభావం ఉండకపోవచ్చు..!

Tuesday 10th July 2018
Markets_main1531218944.png-18171

ముంబై: దేశీయ జనరిక్ కంపెనీలపై ట్రంప్‌ హెల్త్‌కేర్‌ పాలసీ ప్రభావం ప్రతికూలంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఫార్మా రంగ నిపుణులు కెవాల్ హండ.. ధరల పరంగా మాత్రం ఒత్తిడి ఉండేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గడిచిన రెండు నెలల కిందట ఒబామా హెల్త్‌కేర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈ చర్య ద్వారా అమెరికన్లకు అత్యంత చౌకగా మందులను అందుబాటులో ఉంచడం తన ఉద్ధేశ్యం అనే విషయాన్ని తెలియజేయాలనుకున్నారని కెవాల్‌ ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇతర దేశాల్లో మందులపై ఎక్కువ మొత్తంలో వసూలు చేసి, అమెరికన్లకు అతి తక్కువ ధరలకు మందులు అందజేయాలని అక్కడి కంపెనీలకు సూచిస్తున్నారని, జనరిక్‌ కంపెనీలను అమెరికాకు ఆహ్వానించి అక్కడే ఉత్పత్తులను పెంచమని ట్రంప్‌ కోరుతున్నారని తెలియజేసిన ఆయన.. ధరలను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వమే మందులను కొనుగోలుచేసే విధానాన్ని అమలుపరిచే యోచన చేస్తున్నారని వివరించారు. ఇదే సమయంలో టోకు వర్తకులు, సూపర్ స్టాకిస్టుల మార్జిన్లను తగ్గించాలనేది ట్రంప్‌ నిర్ణయమని తెలిపారు. అంతిమ లక్ష్యం ధరలను గణనీయంగా తగ్గించి అమెరికన్లకు అతి తక్కువకు మందులు అందుబాటులో ఉండాలనేదే ఆ దేశ అధ్యక్షుడి లక్ష్యమన్నారు. ఈ నిర్ణయం కారణంగా భారత జనరిక్స్‌కు ధరల సవాళ్లు ఉంటాయే తప్పించి జనరిక్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఇంతకుమించి ఏమీ ఉండదని అన్నారు. ఇది కూడా కేవలం పేటెంట్‌ ఉన్న మందులపైనే తప్ప అమెరికా పేటెంట్‌ లేని మందులపై ఈ భారం ఉండదన్నారు. మేధో సంపత్తి కారణంగా అమెరికా కంపెనీలకు సమానంగా లేదంటే, కాస్త తక్కువ ధరలకు మందులను విక్రయించాల్సి ఉండగా.. ఇతర దేశాలలో ఐపీ ప్రభావం ఉండదని వివరించారు. 



You may be interested

ఆటో రంగ షేర్లపై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Tuesday 10th July 2018

గ్రామీణ ప్రాంతం నుంచి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఆటో, ఆటో విడిభాగాల కంపెనీల క్యూ1 ఫలితాలు ఆకర్షణీయంగా ఉండనుండాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేసింది. బీఎస్‌ ఫైవ్‌, వస్తు సేవల పన్ను అమలు అనంతరం నూతన వాహనాల విడుదల ఆధారంగా అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, లూమాక్స్‌ ఆటో, జేబీఎమ్‌ ఆటో, జామ్నా ఆటో కంపెనీల షేర్లును సూచించింది. ఈ షేర్లు తమ టాప్‌ పిక్స్‌గా ఉన్నాయని వెల్లడించింది.

ఈ కంపెనీల నికరలాభం డబుల్‌...

Tuesday 10th July 2018

బ్రోకరేజ్‌ల బుల్లిష్‌ అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పది కంపెనీలు గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెట్టింపు నికరలాభం నమోదు చేయవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఈ కంపెనీల షేర్లపై ఆయా బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. వీటి వివరాలు.. కోటక్‌ ఈక్విటీస్‌... 1. అపోలో టైర్స్‌: నికరలాభం 173 శాతం పెరగవచ్చని అంచనా. నికర విక్రయాలు 21

Most from this category